NTV Telugu Site icon

Brijbhushan: లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్‌భూషణ్‌కు మధ్యంతర బెయిల్.. ఈ నెల 20న మళ్లీ విచారణ

Brij

Brij

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు మధ్యంతర బెయిల్ లభించింది. రూ.25,000 వ్యక్తిగత పూచీకత్తుపై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు సమన్లు జారీ చేయడంతో మంగళవారం బ్రిజ్ భూషణ్‌ను హాజరుపరిచారు. అయితే విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యంతర బెయిల్‌ లభించింది. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, సహ నిందితుడు వినోద్ తోమర్‌లకు కోర్టు రెండు రోజుల పాటు రిలీఫ్ ఇచ్చింది. జూలై 20న మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ కేసుపై విచారించనున్నారు.

Heavy Rains Alert: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. గంగోత్రి-యమునోత్రి నేషనల్‌ హైవే మూత

బ్రిజ్ భూషణ్ తరఫున న్యాయవాది ఏపీ సింగ్, రాజీవ్ మోహన్ వాదించగా.. ఢిల్లీ పోలీసుల తరఫున అతుల్ శ్రీవాస్తవ వాదించారు. విచారణ సందర్భంగా.. బ్రిజ్ భూషణ్ తరఫు న్యాయవాది రాజీవ్ మోహన్ మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయకుండానే ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారని తెలిపారు. ఏ సెక్షన్‌లోనూ 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షపడే నిబంధన లేదని అన్నారు. అంతేకాకుండా ఈరోజే ఛార్జ్ షీట్ పొందుతున్నామని.. ఈ విషయాన్ని లీక్ చేయబోమని, ఇతరులు కూడా జర్నలిస్టులకు లీక్ చేయవద్దని వాదించారు.

NARFBR Hyderabad Jobs: హైదరాబాద్ లో ఉద్యోగాలు.. ఇంటర్ అర్హతతో భారీ వేతనాలు..

రెజ్లర్ల ఆరోప‌ణ‌ల కేసులో ప‌లుమార్లు బ్రిజ్‌ భూషణ్ ను పోలీసులు విచారించారు. కానీ విచార‌ణ‌లో ఏం తేలింద‌న్న అంశాల్ని మాత్రం బ‌హిర్గతం చేయ‌లేదు. ఒక‌వేళ రెజ్లర్లను వేధించిన‌ట్లు నిర్ధార‌ణ జ‌రిగితే.. బ్రిజ్ భూష‌ణ్‌కు ఐదేళ్ల జైలు శిక్షప‌డే ఛాన్సు ఉంది. మరోవైపు ఈ కేసులో ఢిల్లీ పోలీసులు గత నెలలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. జూలై 6న బ్రిజ్ భూషణ్ సింగ్ హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై 6 మంది మహిళా రెజ్లర్ల ఆధారంగా అభియోగాలు మోపారు. పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై 354, 354-ఎ, 354డి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సహ నిందితుడు వినోద్ తోమర్‌పై ఐపిసి సెక్షన్‌ 109, 354, 354 (ఎ), 506 కింద అభియోగాలు మోపారు.