Ramayan : అసలు లేదన్నారు.. అప్పుడే క్లైమాక్స్ ఏంటీ మామ కొత్త ట్విస్ట్
- క్లైమాక్స్ కు చేరిన రామాయణ్
- సినిమా ఆగిపోయిందన్న పుకార్లకు చెక్
- సాయిపల్లవిపై కీలక సన్నివేశాల చిత్రీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayan : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‍తో బాలీవుడ్‍లో ‘రామాయణం’ ను తెరకెక్కిస్తున్నారు. ఈ రామాయణంలో శ్రీరాముడిగా రణ్‍బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటించనున్నట్లు గత కొంత కాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇందులో మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. 2025 దీపావళికి రామాయణం పార్ట్-1ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అప్పుడెప్పుడో వచ్చిన సమాచారమే కానీ మళ్లీ మధ్యలో ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్స్ ఆ ప్రాజెక్ట్ గురించి రాలేదు. దీంతో అసలు రామాయణం ఉందా లేదా అని సినీ ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:AlluArjun : గుంటూరుకారం ట్రైలర్ వ్యూస్.. రికార్డు బద్దలు కొట్టిన పుష్ప -2
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఐతే, ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్దిరోజుల్లోనే ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో, మేకర్స్ ప్రస్తుతం ముంబైలో ఇండోర్ షూటింగ్ చేస్తున్నారు. ఐతే ఈ నెల నాలుగో వారం నుంచి జరగబోయే కొత్త షెడ్యూల్ లో సాయి పల్లవి పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్నారు. మేకర్స్ ప్రస్తుతం ముంబైలో ఇండోర్ షూటింగ్ చేస్తున్నారు. ఐతే, డిసెంబర్ మొదటి వారం నుంచి జరగబోయే కొత్త షెడ్యూల్ లో క్లైమాక్స్ లోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ సన్నివేశాలు సినిమాలోనే కీలకం అని, ముఖ్యంగా సాయి పల్లవి నటనను ఎలివేట్ చేసే ఈ సీన్లతో ఆమె నటన స్థాయి మరో మెట్టుకు ఎదుగుతుందని తెలుస్తోంది. అన్నట్టు కన్నడ స్టార్ హీరో యష్ ఈ మూవీ ప్రొడక్షన్ లో కూడా భాగమైనట్లు తెలుస్తోంది. ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతుంది.
Read Also:FCI: రేషన్ ధాన్యంలో 28 శాతం పేదలకు చేరడం లేదు.. ఎక్కడికి వెళుతోంది?
- Tags
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?