Andhra Pradesh: టీటీడీ లెటర్స్పై మండలిలో ఆసక్తికర చర్చ
- టీటీడీ లెటర్స్పై మండలిలో ఆసక్తికర చర్చ
- ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేల మాదిరి సమానంగా చూడాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: టీటీడీ లెటర్స్పై మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేల మాదిరి సమానంగా చూడాలని ఎమ్మెల్సీలు లక్ష్మణ రావు, రవీంద్ర, వేంకటేశ్వర రావు కోరారు. ఇప్పటి వరకు నాలుగు రోజులు లెటర్‌కు 6 మందికి దర్శనం అనుమతి ఇచ్చారని ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. వారంలో ఆరు రోజులకు లెటర్‌కు 10 మందికి దర్శనానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీలు కోరారు. ఎమ్మెల్యేలతో సమానంగా తమకు సముచిత టీటీడీ అధికారులు గౌరవం ఇవ్వాలని ఎమ్మెల్సీలు కోరారు. ఇది పెద్దల సభ అని ఎమ్మెల్యేల కంటే ఎక్కువ అడగాలని మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు. టీటీడీ లెటర్స్ విషయంలో తాను కూడా ఇబ్బంది పడినట్టు సభలో మంత్రి ఆనం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది తన లెటర్‌కు అనుమతి ఇవ్వని అనుభవం తనకు ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. టీటీడీ లెటర్లపై సభ్యుల లేవనెత్తిన అంశంపై సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సమాధానం చెప్పారు.
Read Also: Narsapuram MPDO: అదృశ్యమైన నర్సాపురం ఎంపీడీవో మృతి!
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
అంతకుముందు టీటీడీలో అక్రమాలపై మండలిలో చర్చ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానం ఇచ్చారు. టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించామన్నారు. ప్రాథమిక నివేదిక వచ్చిందని.. ప్రస్తుతం విచారణ జరుగుతోందని వెల్లడించారు. పూర్తి స్థాయి నివేదిక తర్వాత అధికారులు, అనధికారులపై చర్యలు ఉంటాయన్నారు. టీటీడీలో గత ఐదేళ్లలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయని మంత్రి చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1300 కోట్లు ఆదాయం వచ్చిందని.. 1000 కోట్లు బ్యాంక్స్‌లో డిపాజిట్ చేశామని చెప్పారు. రూ.300 కోట్లు గోవిందరాజు సత్రం పునర్నిర్మాణం కోసం కేటాయించామన్నారు. ఈ పనుల్లో టెండర్లు కూడా లోపాలతో ఉన్నట్టు తెలుస్తోందని.. దేవుడి సొమ్ము దొంగలు పాలు అన్నట్టు గత పాలకుల విధానం ఉందన్నారు. స్విమ్స్, బర్డ్స్ ఆసుపత్రుల నిర్వహణ కూడా వదిలేశారని ఆరోపించారు. పవిత్ర టీటీడీలో గంజాయి, రాజకీయ నినాదాలు మార్మోగాయన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!