Site icon NTV Telugu

Vijaya Shanthi: కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ మధ్యలోనే వెళ్లిపోయిన రాములమ్మ.. అసలు కారణం ఆయనే..!

Vijaya Shanthi

Vijaya Shanthi

తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో మాజీ ఎంపీ విజయశాంతి పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. దీంతో రాములమ్మ ఎక్కువ సేపు అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఉండకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో ఈ విషయంపై తీవ్ర దుమారం రేగుతుంది. దీనిపై ఇప్పటికే ఆమె ట్వీట్టర్ వేదికగా స్పందించారు.

Read Also: Viral Video: రెండు మొసళ్ల మధ్య ఫైట్.. వీడియో చూస్తే షాక్..!

విజయశాంతి ట్విట్: బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు. అది, సరి కాదు.. కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.. అయితే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం.. ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది.. జై శ్రీరామ్, హర హర మహాదేవ, జై తెలంగాణ అని పోస్ట్ చేశారు.

Read Also: Wife Attacked Boss: అదే పనిగా భర్తకు నైట్ షిఫ్ట్.. కోపంతో భార్య ఏం చేసిందంటే?

అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా విజయశాంతి ఈ పోస్టు చేసినట్లు ఉందని పలువురు అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నాడు.. దీంతో ఆదే విషయాన్ని ఇప్పుడు విజయశాంతి ప్రస్తావిస్తూ ఈ కామెంట్స్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Exit mobile version