అమెరికా దేశ పర్యటనలో ఉన్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్భంగా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. అమెరికా లాగా భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని, రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో వైట్ హౌస్ పేర్కొనింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు.
Read Also: Uttar Pradesh: ప్రధాని పేరు చెప్పకపోవడంతో వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకున్న వధువు
జూన్ 22వ తేదీన మోడీ గౌరవార్థం జో బిడెన్ దంపతులు డిన్నర్ ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో మోడీ సంయుక్త సెషన్ ను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. భారతదేశంలో శక్తివంతమైన ప్రజాస్వామ్యం ఉంది.. వారు కూడా ప్రజాస్వామ్యయుతంగా బాగా పని చేస్తారు.. ఏ సమయంలోనైనా ప్రజాస్వామ్యం పరిపూర్ణతను చేరుకుంటోంది అని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ పేర్కొన్నాడు.
Read Also: Anil Ravipudi : బాలయ్య తర్వాత నెక్స్ట్ సినిమా ఏ హీరోతో తీస్తున్నారో తెలుసా?
భారతదేశం మరింత పరిపూర్ణంగా మారడానికి మా మధ్య సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రపంచంలోని ఈ రెండు శక్తివంతమైన, ప్రభావవంతమైన ప్రజాస్వామ్యాల మధ్య ఈ ద్వైపాక్షిక సంబంధాన్ని కొనసాగించబోతున్నాం అని కిర్బీ వెల్లడించారు. అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా, ఏ నాయకులతో మాట్లాడినా మానవ హక్కులపై ఆందోళన లేవనెత్తారని కిర్బీ చెప్పుకొచ్చారు. అమెరికా దేశం తన స్నేహితులు, మిత్రదేశాలు, భాగస్వాములు, అంతగా స్నేహపూర్వకంగా లేని దేశాలతో కూడా మానవ హక్కుల ఆందోళనలను లేవనెత్తుతుందని జాన్ కిర్బీ తెలిపారు. ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో కీలక ఒప్పందాలు ఉండే అవకాశం ఉందని అమెరికా వైట్ హౌస్ పేర్కొంది.
