NTV Telugu Site icon

Inter Supplementary Exam: నేటి నుంచే తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Inter Supplementary Exam

Inter Supplementary Exam

తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం రెండున్నర నుంచి 5.30 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా 933 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

Read Also : Varahi Yatra: పవన్ వారాహి యాత్రపై కొనసాగుతున్న సస్పెన్స్

మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు 2 లక్షల 70 వేల 583 మంది.. రెండో సంవత్సరం లక్ష 41 వేల 742 మంది విద్యార్థులు.. మొత్తం కలిపి 4 లక్షల 12 వేల 325 మంది స్టూడెంట్స్ ఈ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. మాల్ ప్రాక్టీస్ వంటి అక్రమాలకు పాల్పడినతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

Read Also : Egypt: ఈజిప్టులో ఘోర ప్రమాదం.. 27 మంది ప్రయాణిస్తున్న పడవలో మంటలు.. ముగ్గురు గల్లంతు

వేగంగా మూల్యాంకనం పూర్తి చేసి వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తులు చేస్తుంది. అయితే పరీక్షాకేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని సూచించారు. నిమిషం అలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతివ్వమని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఎలాంటి ఒత్తిడి.. భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించింది. పరీక్ష రాసే సమయంలో ప్లైయింగ్ స్వ్కాడ్ తనిఖీలు చేపడుతుంది.. మాల్ ప్రాక్టీస్ చేసిన వారిని వెంటనే డీబార్ చేస్తామని ఇంటర్ బోర్డు పేర్కొనింది.