NTV Telugu Site icon

Crime News: గణేష్ నిమజ్జనం చేస్తుండగా కనిపించిన విద్యార్థిని మృతదేహం.. శిరోముండనం చేసి!

Inter Student

Inter Student

Crime News: చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని మృతి సంచలనం రేపుతోంది.17వ తేదీ రాత్రి అదృశ్యమైన కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ .. గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో శవమై కనిపించింది. శిరోముండనం చేసి, కనురెప్పలు కత్తిరించి చంపిన తర్వాత బావిలో పడేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: FBI: “మీ ప్రాణాలు జాగ్రత్త”.. నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్తానీలకు ఎఫ్‌బీఐ వార్నింగ్

బాధిత భవ్యశ్రీ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వడ్డెర సంఘం నాయకులు పెనుమూరు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా దిగారు. ఘోరంగా హత్య చేసి బావిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.మృతదేహాన్ని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ నెల 17న అమ్మాయి మిస్సింగ్‌ కేసు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడించారు. ఈ నెల 20న వ్యవసాయ బావి దగ్గర అమ్మాయి మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. మెడికల్‌, ఫోరెన్సిక్‌ రిపోర్టుల ఆధారంగా విచారణ చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.

Show comments