NTV Telugu Site icon

Student Suicide: ఇంటర్ విద్యార్థి సూసైడ్.. ఐ మిస్‌ యూ ఫ్రెండ్స్‌ అంటూ స్టేటస్

Vkb Boy Suside

Vkb Boy Suside

వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలంలోని మల్కాపూర్‌కు చెందిన మనోహర్‌ అనే విద్యార్థి ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన మొబైల్‌ వాట్సాప్‌లో ‘ఐ మిస్‌ యూ ఫ్రెండ్స్‌’ అని స్టేటస్‌ పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పదేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో తండ్రి తాగుడుకు బానిస కావడంతో కుటుంబంలో గొడవల కారణంగా అన్నతో మాటల్లేకపోవడంతో తనకి ఎవరూ లేరు అనే మనోవేదనకు గురైన ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Read Also: Attack On Indian Consulate: శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి

మనోహార్ స్టేటస్ చూసిన చిన్నాన్న కూమారుడు భాను ప్రసాద్‌ ఫోన్‌ చేశాడు. స్పందించక పోవడంతో పొలం దగ్గరకు వెళ్లాడు. అప్పటికే మనోహర్‌ చెట్టుకు వేళాడుతూ విగతజీవిగా కనిపించాడు. ఈ విషయాన్ని భానుప్రసాద్‌ మృతుడి సోదరుడు మల్లేశ్‌కు తెలియజేశాడు. మనోహర్‌ తన తండ్రి, స్నేహితులతోనే ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాడని.. కొంతకాలంగా వాళ్ల నాన్న మద్యానికి బానిస కావడం.. తనను సరిగ్గా చూసుకోకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని మల్లేశ్‌ పొలీసులకు తెలిపాడు.

Read Also: TS BJP: బండిపై రఘునందన్ వ్యాఖ్యలు.. హైకమాండ్ కు చేరిన ఇష్యూ

తన తండ్రి తాగుడుకు బానిస కావడంతో పాటు కుటుంబంలో గొడవల కారణంగా మనోహార్ తన స్నేహితులను మిస్ అవుతున్నట్లు వాట్సాప్ స్టేటస్ పెట్టడంతో అతని చివరి క్షణాల్లోని మాటలను తలుచుకుని అతని ఫ్రెండ్స్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. మనోహార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఎస్‌ఐ పురుషోత్తం ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.