Bhadradri Kothagudem: ఇంటర్ పరీక్షా కేంద్రంలోని టాయ్‌లెట్‌లో.. మృత శిశువుకు జన్మనిచ్చిన ఫస్ట్ ఇయర్ విద్యార్థిని

  • మృత శిశువుకు జన్మనిచ్చిన ఫస్ట్ ఇయర్ విద్యార్థిని
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన
  • 16 ఏళ్ల బాలిక ఇంగ్లిష్ పరీక్ష రాయటానికి వచ్చింది
First Year Student

First Year Student

ఇంటర్ పరీక్షా కేంద్రంలోని టాయ్‌లెట్‌లో మృత శిశువుకు మైనర్ బాలిక జన్మనిచ్చిన ఘటన కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్వంచలోని ఓ కేంద్రానికి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఇంగ్లిష్ పరీక్ష రాయటానికి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఇన్విజిలేటర్ అనుమతితో టాయ్‌లెట్‌కు వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవటంతో మరుగు దొడ్డి వైపు వెళ్లి చూశారు.

Also Read:Afghan-Pak War: పాక్‌పై తాలిబన్ సైన్యం మెరుపుదాడులు.. వీడియో విడుదల

బాలిక నెమ్మదిగా నడుచుకుంటూ బయటికి రావడంతో ఎగ్జామ్ సెంటర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. బాలిక వివరాలు ఆరా తీయటంతో అసలు విషయం బయటపడింది. సిబ్బంది వెళ్లిచూడగా.. బేసిన్‌లో మృతశిశువు పడి ఉండడంతో షాక్ కు గురయ్యారు. అయితే పరువు పోతుందనే భయంతోనే ఎవరికీ అనుమానం రాకుండా శిశువును బాత్రూం బేసిన్‌లో కుక్కినట్లు బాలిక తెలిపినట్లు సిబ్బంది తెలిపారు.