Site icon NTV Telugu

Inter Colleges : ఇంటర్‌ కాలేజీలకు షాక్‌ ఇచ్చిన ఇంటర్ బోర్డు

Omer Jaleel

Omer Jaleel

Inter board secretary Omer Jaleel about new colleges

నేడు తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ఉమర్‌ జలీల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మాట్లాడుతూ.. 1582 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయని వెల్లడించారు. అయితే.. ఇప్పటి వరకు అనుమతి పొందిన కాలేజి లు 786 కాగా.. 584 కాలేజీలకు సరైన డాక్యుమెంట్స్ సమర్పించలేదని.. వాటిని సబ్మిట్ చేయాలని అడిగామన్నారు. అంతేకాకుండా.. 457 కాలేజీలు మిక్స్‌డ్‌ అక్యుపెన్సీ కాలేజీలని, ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగ్ లో ఉందన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల లో 584 మంది ఇతర రాష్ట్రాల యూనివర్సిటీ లలో పీజీ చేసినట్టు సర్టిఫికెట్ లు సబ్మిట్ చేశారని, సర్టిఫికెట్ లలో ఫేక్ అని తేలితే క్రిమినల్ చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

 

ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్స్ 70,259 జరిగాయని, పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యం అయినా మాట వాస్తవమేనన్నారు. రెండు రోజుల్లో (ద్వితీయ సంవత్సరం) ప్రభుత్వ కాలేజీలకు పాఠ్యపుస్తకాలు, 10 రోజుల్లో మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకాలు అందజేస్తామన్నారు. సెప్టెంబర్ 15 వరకు అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి అవుతుందని ఆయన తెలిపారు.

 

 

Exit mobile version