NTV Telugu Site icon

Schools Close: ఢిల్లీలో తీవ్ర ఎండలు.. నోయిడాలో పాఠశాలలు మూసివేత

Schools Close

Schools Close

దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా, ఢిల్లీలో మాత్రం ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో.. ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌లో ఎండ వేడిమికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. వేడి, తీవ్రమైన వేడి దృష్ట్యా.. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో (నోయిడా-గ్రేటర్ నోయిడా) పాఠశాలలను మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మూసి ఉంచాలని అధికారులు తెలిపారు.

నోయిడాలో ఇంతకుముందు 8వ తరగతి చదువుకునే విద్యార్థుల వరకు మూసివేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఎండ తీవ్రత దృష్ట్యా 12వ తరగతి వరకు మూసివేయనున్నారు. కాగా.. ఈ ఆర్డర్ అన్ని బోర్డు పాఠశాలలకు వర్తిస్తుందని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా స్కూల్ ఇన్‌స్పెక్టర్ ధరమ్‌వీర్ సింగ్ తెలిపారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ ఉత్తర్వును పాటించాలని కోరారు.

Bank FD: సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకులేవో తెలుసా?

నోయిడాలోని గౌతమ్‌బుద్ధ నగర్‌లో రోజురోజుకూ వేడి పెరుగుతోంది. సోమవారం గరిష్టంగా ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. అంతేకాకుండా.. రోజంతా వేడిగాలులు వీచాయి. వేడి గాలుల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు అవస్థలు పడ్డారు. కాగా.. మే 24 వరకు తీవ్రమైన వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు.. ఉష్ణోగ్రత వరుసగా నాలుగో రోజు 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. పగటిపూట గంటకు 14 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి వేడిని పెంచింది.

ఎండల తీవ్రత దృష్ట్యా.. జిల్లాలో 8వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలను మే 25 వరకు మూసివేయాలని డీఎం ఇందర్ విక్రమ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా వేడిగాలులు ప్రబలుతున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎండల దృష్ట్యా పిల్లలలో సమస్యలు తలెత్తవచ్చు. ఈ కారణంగా.. అన్ని పాఠశాలలను 2024 మే 20 నుండి మే 25 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.