NTV Telugu Site icon

TS High Court: తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నష్టంపై హైకోర్టులో విచారణ

High Court

High Court

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నష్టంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానంలో డాక్టర్ చెరుకు సుధాకర్ పిటిషన్ దాఖలు చేశారు. వర్షాలకు 41 మంది మృతి, 1.59లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. పలు మరణాలను నివేదికలో ప్రస్తావించలేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు అని న్యాయవాది ఆరోపించారు. రాష్ట్రంలో విషజ్వరాల నియంత్రణ కోసం తగిన చర్యలు చేపట్టడం లేదని లాయర్ అన్నాడు.

Read Also: Riyan Parag: సెంచరీలు కొట్టిన ట్రోల్స్ ఆగడం లేదు.. ఎందుకు?

రెండు రోజుల్లో మరిన్ని వివరాలతో మరో నివేదిక ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపున లాయర్ పేర్కొన్నారు. విషజ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గల్లంతైన వారిని గుర్తించేందుకు తీసుకున్న చర్యలు తెలపాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం చెప్పింది. భూపాలపల్లి జిల్లాలోని మృతుల వివరాలు కూడా వెల్లడించాలని వెల్లడించింది. షెల్టర్లు, ఇతర సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారా లేదా అనేది నివేదించాలని హైకోర్టు తెలిపింది.

Read Also: Heart Emoji: వాట్సాప్‌లో హార్ట్‌ సింబల్‌ పంపితే చిక్కులే.. ఐదేళ్ల జైలు, భారీ జరిమానా..!

విద్యుత్, ఇంటర్నెట్, ఫోన్ వంటి వ్యవస్థల పునరుద్ధరణ చర్యలు గురించి వివరించాలని హైకోర్టు తెలిపింది. వరద బాధితులకు మనోధైర్యం ఇచ్చేందుకు తీసుకున్న చర్యలు.. కడెం ప్రాజెక్టు పరిసర ప్రజల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. భారీ వర్షాలు, వరదల నష్టంపై విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.