NTV Telugu Site icon

Uttar Pradesh: యూపీలో అమానుషం.. కట్నం డబ్బులు తీసుకురాలేదని మహిళను వివస్త్రను చేశారు..

Up

Up

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. భర్త, బావ కలిసి ఓ మహిళను వివస్త్రను చేసి, పరిగెత్తేలా చేసి కొట్టారు. అంతేకాకుండా.. గొంతు నులిమి హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు తనపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించింది. ఎస్‌ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tirumala: 2023 సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

వివరాల్లోకి వెళ్తే.. గోరఖ్‌పూర్ జిల్లాలోని హర్పూర్-బుధాత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తన భర్త, కుటుంబ సభ్యులు తరుచూ కట్నం కోసం వేధించేవారని తెలిపింది. పెళ్లి సమయంలో తమ తల్లిదండ్రులు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ కట్నం ఇచ్చారని బాధితురాలు చెప్పింది. అయినప్పటికీ.. ఆమె అత్తమామలు కట్నం కోసం రోజూ కొట్టేవారని పేర్కొంది. కట్నం విషయంలో తన అత్తమామలు తన పిల్లలను చాలాసార్లు కొట్టి గాయపరిచారని బాధిత మహిళ ఆరోపించింది. తల్లిదండ్రుల ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని భర్త, బావ ఒత్తిడి చేశారని పేర్కొంది. ఆ సమయంలో వారిద్దరూ కలిసి ఆమె శరీరంపై ఉన్న బట్టలన్నీ తొలగించి, ఆమెను చంపడానికి వెంట పడ్డారని చెప్పింది. ఎలాగోలా తన ప్రాణాలను కాపాడుకోవాలని, బట్టలు లేకుండా గ్రామంలో రోడ్డుపై పరిగెత్తినట్లు పోలీసులకు తెలిపింది.

Shubman Gill: నా లక్ష్యాలు ఇవే.. అన్నీ నెరవేరాయి కానీ, ఆ ఒక్కటి మాత్రం..!

గ్రామంలో తన ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెత్తే సమయంలో ప్రజలు ఆ దృశ్యాన్ని చూస్తున్నారని ఫిర్యాదు లేఖలో ఆ మహిళ పేర్కొంది. తనను కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదని.. నిందితులు తనను పట్టుకుని కర్రలతో తీవ్రంగా కొట్టారని చెప్పింది. ఈ సమయంలో గొంతు నులిమి హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారని తెలిపింది. గ్రామంలోని కొంతమంది మంచి వ్యక్తుల చొరవ వల్లే తన ప్రాణం కాపాడబడిందని ఆ మహిళ చెప్పింది. ఒక గ్రామ మహిళ తనకి బట్టలు ఇచ్చిందని.. వాటితో తన శరీరాన్ని కప్పుకున్నట్లు తెలిపింది.

Show comments