Infosys: ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. అయితే ఇటీవల కరోనా కారణంగా పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో చాలా మంది ఉద్యోగులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నట్లు బహిర్గతమైంది. దీంతో పలు కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఇన్ఫోసిస్ కూడా రంగంలోకి దిగింది. కొద్దిరోజుల కిందట తమ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించింది. ఎవరైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కంపెనీ నియమాలను ఉల్లంఘించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ (ద్వంద్వ ఉపాధి) అనేది కంపెనీ ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. డేటా లీక్, రహస్య సమాచారం లీకేజీ, ఉద్యోగుల పనితీరు వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.
Read Also:Girls New Strategy: 50 ఏళ్లు పైబడిన వ్యక్తితో ఎఫైర్.. బాగా సుఖపెడితేనే పెళ్లి..!!
ఆఫర్ లెటర్‌లో స్పష్టంగా పేర్కొన్నట్లు తమ సమ్మతి లేకుండా ఏదైనా ఇతర సంస్థ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నా.. ఏదైనా ఇతర సంస్థలో పార్ట్‌టైమ్ లేదా భాగస్వామిగా ఉన్నా నేరమని ఇన్ఫోసిస్ యాజమాన్యం స్పష్టం చేసింది. మరోవైపు ఇదే అంశంపై విప్రో అధినేత ప్రేమ్ జీ కొన్ని రోజుల క్రితం స్పందించారు. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడం సరికాదని… ఈ పద్ధతి మోసం అని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగులు మారుమూల ప్రాంతాల నుండి పని చేయడానికి అనేక ఐటీ సంస్థలు అనుమతించాయి. ప్రత్యేకించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తమ ఉద్యోగులు ఇతరుల కోసం ప్రాజెక్ట్‌లపై ఏకకాలంలో పని చేయడానికి రిమోట్ వర్కింగ్ సదుపాయాన్ని ఉపయోగించారు. ఇదే అదనుగా పలువురు ఉద్యోగులు ఇతర సంస్థల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నట్లు కంపెనీల దృష్టికి రావడంతో తాజాగా చర్యలు చేపడుతున్నాయి.