జపాన్‌లోని ఇచికావా సిటీ జూ లో ఉన్న ఏడు నెలల బేబీ జపనీస్ మాకాక్ కోతి “పంచ్” ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. తల్లి తిరస్కరించడంతో జూ సిబ్బంది దాన్ని పెంచారు. ఇతర కోతులు దాన్ని దగ్గరికి రానీయకపోవడంతో, పంచ్ ఒక స్టఫ్డ్ ఆరెంగుటాన్ బొమ్మను గట్టిగా పట్టుకుని ఓదార్పు పొందుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. తర్వాత వచ్చిన కొన్ని వీడియోల్లో పెద్ద కోతులు పంచ్‌ను లాగడం, కొట్టడం వంటి సీన్లు కనిపించడంతో “బుల్లింగ్” అని భావించి నెటిజన్లు భారీగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియోలు చూసిన ఇన్‌ఫ్లుయెన్సర్ ఆండ్రూ టేట్, సోదరుడు ట్రిస్టన్ టేట్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. “ఈ కోతి ఏ జూలో ఉంది? నేను, @Cobratate (ఆండ్రూ టేట్) కలిసి దాన్ని కొనేస్తాం. $250,000 (సుమారు రూ. 2 కోట్లు). నేను జోక్ చేయడం లేదు” అని పోస్టు చేశారు. ఈ పోస్ట్ కొద్ది రోజుల్లోనే 55 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
Also Read:Samantha : నెగెటివిటీ ఉంటే బ్లాక్ చేస్తా.. ట్రోలర్లకు సమంత ‘స్ట్రాంగ్’ వార్నింగ్..
ట్రిస్టన్ టేట్ బిడ్ వల్ల సోషల్ మీడియాలో భారీ డిబేట్ మొదలైంది.. కొందరు టేట్ బ్రదర్స్ దాన్ని రెస్క్యూ చేయాలని సపోర్ట్ చేశారు. మరికొందరు జూలోనే ఉంచి సరైన కేర్ ఇవ్వాలని, డబ్బుతో కొనడం సరికాదని అంటున్నారు. కొందరు జూకు డొనేషన్లు చేయాలని సూచిస్తున్నారు. ఇటీవలే ట్రాన్ జస్టిన్ సన్ (Justin Sun) కూడా ఈ జూకు $100,000 డొనేట్ చేశాడని వార్తలు వచ్చాయి. జూ ఇంకా టేట్ బ్రదర్స్ ఆఫర్‌పై ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. పంచ్ ఇప్పుడు క్రమంగా ఇతర కోతులతో స్నేహం చేస్తోందని, హ్యాపీగా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ క్యూట్ బేబీ మంకీ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది హార్ట్స్‌ను టచ్ చేసింది.
