NTV Telugu Site icon

Harmanpreet Kaur: మా లక్ష్యం విజయం మాత్రమే కాదు: హర్మన్‌ప్రీత్

Harmanpreet Kaur

Harmanpreet Kaur

శ్రీలంకపై విజయం మాత్రమే లక్ష్యంగా తాము బరిలోకి దిగలేదని, నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునేలా ఆడాలనుకున్నాం అని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బ్యాటింగ్‌ చేయడంపై చర్చించుకున్నామని, కనీసం 7-8 రన్‌రేట్‌ కంటే ఎక్కువగా పరుగులు చేయాలని భావించామని చెప్పారు. శ్రీలంకపై భారీ మార్జిన్‌తో గెలినప్పుడే నెట్‌రన్‌రేట్‌ పెరిగే అవకాశం ఉంటుందని, అందుకే రన్‌రేట్‌పైనా దృష్టిపెట్టామని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చారు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో గెలిచింది.

Also Read: SSMB 29: మహేష్-రాజమౌళి మూవీ.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్!

హాఫ్ సెంచరీ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ… ‘ఆ దేవుడి దయ వల్ల అంతా బాగానే సాగుతోంది. నా మెడ నొప్పి కూడా తగ్గింది. నాణ్యమైన క్రికెట్ ఆడినప్పుడు మానసికంగానూ బాగుంటుంది. శ్రీలంకపై మేం అన్ని విభాగాల్లో రాణించాం. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో చాలా మెరుగయ్యాము. మ్యాచ్ ప్రారంభానికి ముందు బ్యాటింగ్‌ చేయడంపై చర్చించుకున్నాం. కనీసం ఏడు నుంచి ఎనిమిది రన్‌రేట్‌ కంటే ఎక్కువగా పరుగులు చేయాలని భావించాం. బ్యాటింగ్‌కు కాస్త ఇబ్బందిగా అనిపించినా.. మంచి ఆరంభం దక్కింది. 160కి పైగా పరుగులు చేసి.. భారీ తేడాతో గెలవాలని అనుకున్నాం. అప్పుడే నెట్‌రన్‌రేట్‌ పెరిగే పెరుగుతుంది. మ్యాచ్ గెలిచి రెండు పాయింట్లను ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో కాకుండా.. రన్‌రేట్‌పైనా దృష్టిపెట్టాం. మా బ్యాటర్లు, మా బౌలర్లు ప్రణాళికలను అమలు చేశారు. కెప్టెన్‌గా నేను చాలా సంతోషంగా ఉన్నా’ అని చెప్పారు.