IND vs NZ: న్యూజిలాండ్‌తో సిరీస్‌.. హర్మన్‌ప్రీత్‌కే కెప్టెన్సీ! నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు

  • న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
  • హర్మన్‌ప్రీత్‌కే జట్టు బాధ్యతలు
  • వైస్‌ కెప్టెన్‌గా మంధాన
  • నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు
Harmanpreet Kaur

Harmanpreet Kaur

Harmanpreet Kaur Captain For New Zealand ODI Series: న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం సెలెక్షన్‌ కమిటీ గురువారం 16 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ లీగ్ దశ నుంచే నిష్క్రమించినా.. సెలక్టర్లు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై నమ్మకం ఉంచారు. కివీస్ వన్డే సిరీస్‌కు ఆమెకే బాధ్యతలను అప్పగించారు. స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఇక భారత జట్టులో నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు దక్కింది.

12వ తరగతి బోర్డు పరీక్షల నేపథ్యంలో వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ను న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఆల్‌రౌండర్‌ పూజ వ్రస్తాకర్‌కు విశ్రాంతిని ఇచ్చారు. గాయం కారణంగా ఆశ శోభనకు జట్టులో చోటు దక్కలేదు. ఈ ముగ్గురు మెగా టోర్నీలో దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత ఎ జట్టు నుంచి తేజల్‌ హస్నాబిస్‌, సయాలీ సత్గారె, ప్రియా మిశ్రాలకు భారత జట్టులో చోటు దక్కింది. మహిళల ఐపీఎల్‌లో రాణించిన సైమా ఠాకూర్‌ జాతీయ జట్టులోకి వచ్చింది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియం అక్టోబర్ 24, 27, 29న మ్యాచ్‌లు జరగనున్నాయి.

Also Read: Rohit Sharma: 365 రోజుల్లో.. 2-3 చెత్త నిర్ణయాలుంటే పర్లేదు: రోహిత్

భారత జట్టు:
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హేమలత, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, ఉమా ఛెత్రీ, సయాలీ, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, తేజల్‌ హసాబ్నిస్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్‌.