Site icon NTV Telugu

Indira Mahila Shakti: నేటి నుంచి ఇందిరా మహిళా శక్తి సంబరాలు..

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణలో నేటి నుంచి పది రోజుల పాటు ఊరువాడ ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించనున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు మహిళా శక్తి విజయాలను పురస్కరించుకొని సంబరాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొత్త సభ్యులను చేర్పించేలా అన్ని స్థాయిల్లో కళా జాతాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా బ్యాంకు రుణాలు, మహిళా సంఘాలకు వడ్డీలు, ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కుల పంపిణీ చేయనున్నారు.

Also Read:Bihar: పాట్నాలో దారుణం.. వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య

నేడు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఇందిరా మహిళా శక్తి సంబరాల వివరాలను విడుదల చేయనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025 తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది మహిళా స్వయం సహాయక బృందాల విజయాలతో పాటు భవిష్యత్త్ కర్తవ్యాలను నిర్దేశిస్తూ ఇందిరా మహిళ శక్తి మిషన్ – 2025. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టిపై ప్రభుత్వం దృష్టిసారించింది.

Exit mobile version