Site icon NTV Telugu

Indigo Flight : ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

Flight Accident

Flight Accident

ఇండిగో విమనానికి పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో అహ్మాదాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఇండిగో విమానం ప్రమాదానికి గురైంది. దీంతో.. గాల్లో విమానం ఉండగానే ముందు భాగం దెబ్బతింది. వడగళ్ల వానకు విమానం ముందు భాగం దెబ్బతినడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం సేఫ్ గా లాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : Amritpal Singh: మానవబాంబులను రిక్రూట్ చేసుకునే పనిలో ఖలిస్తాన్ నేత.. డి-అడిక్షన్ సెంటర్లలో బ్రెయిన్ వాష్

వడగళ్ల వానకు ముందు భాగం దెబ్బతినిందని, అయినా పైలట్ చాకచక్యంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్ గా ల్యాండ్ చేయగలిగారని ప్రయాణికులు మెచ్చుకుంటున్నారు. అయితే.. గత నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వడగళ్ల వానతో ఇప్పటికే బయట పార్క్‌ చేసిన కార్ల అందాలు ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా.. అకాల వర్షం కారణంగా పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Readg : Asaduddin Owaisi: బీహార్‌లో కేసీఆర్‌పై ఓవైసీ ప్రశంసలు.. విజన్ ఉన్న నాయకుడంటూ కితాబు

Exit mobile version