Site icon NTV Telugu

IndiGo: చరిత్ర సృష్టించిన ఇండిగో.. అందులో తొలి భారత విమానయాన సంస్థగా రికార్డు..!

Indigo

Indigo

ప్రముఖ విమాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ చరిత్ర సృష్టించింది. ఒక్క ఏడాదిలో వంద మిలియన్‌ (పది కోట్ల మంది) ప్రయాణించిన తొలి భారత విమానయాన సంస్థగా రికార్డు సాధించింది. ఈ మేరకు ఇండిగో ఎక్స్‌లో అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేస్తూ.. ‘ఒక ఏడాది(2023) క్యాలెండర్ సంవత్సరంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లిన తొలి భారతీయ విమానయాన సంస్థగా అరుదైన ఘనత సృష్టించింది’ అని పేర్కొంది.

Also Read: Mumbai: ఛీఛీ నీచుడు.. డబ్బుల కోసం కట్టుకున్న భార్యనే.. స్నేహితులతో కలిసి..

ఈ రికార్డుతో ఇప్పుడు ఇండిగో ప్రపంచంలోని అతిపెద్ద పది ఎయిర్‌లైన్స్‌ సరసన చేరింది. దేశంలోనే ప్రధాన ఎయిర్‌లైన్‌ సంస్థ అయిన ఇండిగో ఈ అరుదైన ఘనత సాధించడం ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థల సరసన చేరిందని ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఏడాదిలో 100 మిలియన్ల మంది ప్రయాణించిన చారిత్రక మైలురాయిని సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇండిగో కస్టమర్లు చూపిన ప్రేమ, విశ్వాసం, తమ సిబ్బంది కృషి ఫలితంగానే ఈ మైలురాయిని చేరుకున్నామంటూ ఆయన పోస్ట్ షేర్ చేశారు.

Also Read: CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Exit mobile version