Asia Cup Hockey 2023: జపాన్‌లో జరిగిన 2023 మహిళల జూనియర్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ దక్షిణ కొరియాను ఓడించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో 2-1 స్కోరుతో ఓడించి తొలిసారి ఆసియా కప్ ఛాంపియన్‌గా అవతరించింది. భారత్ తరఫున అన్నూ (22′), నీలం (41′) గోల్ చేశారు. కొరియా తరపున పార్క్ సియోన్ ఏకైక గోల్ చేసింది. ఈ కీలకమైన మ్యాచ్ లో జట్టు యొక్క సమిష్టి కృషి విజయానికి దారితీసిందని హాకీ ఇండియా పత్రికా ప్రకటన తెలిపింది.
అంతకుముందు, లీగ్‌లో భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లీగ్‌లో 4 మ్యాచ్‌లు ఆడగా, భారత్ 3 గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. లీగ్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో 22-0తో ఉజ్బెకిస్థాన్‌ను ఓడించింది. ఈ టోర్నీలో 10 జట్లు పాల్గొన్నాయి. భారత జట్టుతో పాటు, చైనా, కొరియా, జపాన్, మలేషియా జట్లను కలిగి ఉన్న ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా అండర్-21 హాకీ టోర్నమెంట్‌లో మరో నాలుగు జట్లకు నేరుగా ప్రవేశం లభించింది. మిగిలిన ఐదు జట్లు, కజకిస్తాన్, హాంకాంగ్, చైనీస్ తైపీ, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా గత ఏడాది అక్టోబర్‌లో కజకిస్తాన్‌లో జరిగిన మహిళల జూనియర్ కప్ ద్వారా టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి.
Read Also: Allu Arjun: ఆహాను టేకోవర్ చేసిన అల్లు అర్జున్.. హోస్ట్ గా గ్రాండ్ ఎంట్రీ..?
హాకీ ఇండియా ప్రెసిడెంట్ పద్మశ్రీ డా. దిలీప్ టిర్కీ భారత జూనియర్ మహిళల జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు ప్రశంసించారు. భారత జూనియర్ మహిళల జట్టు ఆసియా కప్‌ను కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. అలాగే ఈ ఏడాది చివర్లో జరిగే జూనియర్ ప్రపంచ కప్‌లో ఈ గెలుపు బలమైన పునాదిగా ఉపయోగపడుతుందంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా వారి విజయాన్ని గుర్తించేందుకు, హాకీ ఇండియా ఆటగాళ్లకు మంచి నగదు పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించింది.