NTV Telugu Site icon

Indias Gold Demand: పసిడికి భారీగా తగ్గిన గిరాకీ.. అసలు కారణం ఇదే..

Gold

Gold

Indias Gold Demand: భారతీయ సంప్రదాయంలో పసిడికి ప్రత్యేక స్థానం ఉంది.. పెళ్లి లాంటి పెద్ద కార్యక్రమం నుంచి ఏ చిన్న కార్యక్రమం, శుభకార్యం జరిగినా.. పసిడి ఉండాల్సిందే అనే తరహాకు అలవాటుపడ్డారు.. స్థాయిని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి బంగారం ఎక్కువ.. తక్కువ ఉండొచ్చు.. కానీ, బంగారం ఉండాల్సిందేననే నమ్మకం.. ఇక, శుభకార్యాల్లో వధువరులకు గానీ.. ఇతరులకు గానీ.. బంధువులు కూడా పసిడి బహూకరిస్తుంటారు.. అయితే, పసిడి ధరలు క్రమంగా పెరుగుతూ.. సామాన్యులకు అందకుండా పైపైకి కదులుతున్నాయి. దీంతో.. పసిడికి డిమాండ్‌ తగ్గిపోతోంది.. జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్‌ భారీగా అంటే ఏకంగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి రావడంతో ఇలా జరిగిందని.. మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్‌ ట్రెండ్స్‌ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది.

Read Also: Heroines: రష్మిక, పూజలకు శ్రీలీలను శత్రువును చేసిన నెటిజన్లు.. కారణం ఏంటంటే ?

ఇక, డబ్ల్యూజీసీ నివేదికలో పేర్కొన్న అంశాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత్‌లో పసిడి డిమండ్‌ 112.5 టన్నులు ఉండగా.. 2022లో అది 135.5 టన్నులకు చేరింది.. అయితే, ఇదే సమయంలో పసిడి ఆభరణాల డిమాండ్‌ 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది. మరోవైపు.. విలువల రూపంలో చూస్తే, పసిడి కొనుగోళ్లు 9 శాతం క్షీణించాయి.. అంటే రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు పడిపోయింది. నగల డిమాండ్‌ విలువల్లో 9 శాతం క్షీణించి రూ.42,800 కోట్ల నుంచి రూ.39,000 కోట్లకు పరిమితం కాగా.. బంగారంపై పెట్టుబడుల పరంగా అయితే 17 శాతం తగ్గిపోయింది.. అంటే.. బంగారం డిమాండ్‌ 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు పడిపోయింది. ఇది కేవలం భారత దేశానికే పరిమితం కాలేదు.. ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమాండ్‌ తొలి త్రైమాసికంలో బలహీనంగానే ఉంది.. 13 శాతం క్షీణించి 1,080.8 టన్నులకు పరిమితం అయ్యింది.

Show comments