Site icon NTV Telugu

India: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. సీట్ల షేరింగే ప్రధాన ఎజెండానా?

India

India

INDIA’s First Coordination Panel Meet : అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే పాట్నా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ మీటింగ్స్‌ తర్వాత తొలిసారి కూటమి సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఇందులో 14 మంది సభ్యులు ఉంటారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ముంబై వేదికగా ఇండియా కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా సీట్ల షేరింగ్ మీదే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎటువంటి ఈగోలు లేకుండా ఐకమత్యంగా ముందుకు వెళితేనే బీజేపీని ఢీకొట్టగలమని భావిస్తున్న నేతలు ఈసారి బలమైన అభ్యర్థులనే పోటీలో నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. పార్టీలకతీతంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడమే ముఖ్యమైన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది.

Also Read: Hyderabad: జహీరాబాద్‌లో విశాల్‌ షిండే హత్య కేసు.. నిందితుడు నజీర్‌ అహ్మద్‌ మృతి

ఇండియా కూటమిలో ఈ 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుంది. కూటమిలో ఏ నిర్ణయం అయినా ఈ కమిటీనే తీసుకుంటుంది. మోడీ ముందస్తుకు వెళ్తారు అనే వార్తల నేపథ్యంలో వీలైనంత తొందరగా ఈ జాబితాను సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉంది ఇండియా కూటమి. ఇప్పటీకే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థుల కేటాయింపు దాదాపు పూర్తయినట్లే అని అయితే ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ వినతి ఇతర రాష్ట్రాల్లోని అభ్యర్థుల కేటాయింపే కొంచెం కష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ సమావేశాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ఆచరించాల్సిన విధానాలు, సమైక్య ర్యాలీలను నిర్వహించే ప్లాన్లు, డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాల గురించి చర్చిస్తామని కూడా కూటమి సభ్యుడు రాఘవ్ చద్దా సమావేశాలకు ముందు చెప్పారు. ఇండియా కూటమిలో కమిటీ నిర్ణయమే ఫైనల్ కావడంతో ఈరోజు జరిగే సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Exit mobile version