NTV Telugu Site icon

Maldives: మాల్దీవులకు ఇండియన్స్ బిగ్ షాక్.. భారీగా పడిపోయిన ర్యాంక్

Maldives Row

Maldives Row

Maldives: మాల్దీవులకు ఇండియన్స్ భారీ షాక్.. భారీగా పడిపోయిన ర్యాంక్గ.. పొరుగు అన్నాక కాస్తాంత గౌరవ.. మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. బాధ్యతగా మసులు కోవాలంటారు. అంతేకానీ కయ్యాలు పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు అలాంటి పరిస్థితే మాల్దీవులకు దాపురించింది. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు అంటే ఇదేనేమో. గతేడాది వరకు నిత్యం భారతీయ పర్యాటకులతో మాల్దీవుల పర్యాటకం కళకళలాడుతుండేది. ఇప్పుడు దేశ పెద్దలు చేసిన పనికి భారీ మూల్యం చెల్లించుకోవల్సి వచ్చింది.

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల అధికార పార్టీ ఎంపీలు నోరు పారేసుకున్నారు. దీంతో ఆ దేశం.. భారతీయుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఈ సంఘటనతో మాల్దీవుల పర్యటనకు వెళ్లకూడదని భారతీయులు నిర్ణయం తీసుకున్నారు. అంతే ఒక్కసారిగా భారత్‌ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పడిపోయింది. తాజాగా వెల్లడైన అక్కడి పర్యాటక మంత్రిత్వశాఖ గణంకాలే ఇందుకు నిదర్శనం. మాల్దీవుల పర్యాటక ర్యాంకింగ్‌లో మన దేశ స్థానం గణనీయంగా పడిపోయింది.

YCP-TDP Rebel MLA’s: రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మరో ఛాన్స్..

గతేడాది డిసెంబరు 31 వరకు భారత్‌ నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. పర్యాటక మార్కెట్‌లో 11 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా రెండో స్థానంలో.. చైనా మూడో స్థానంలో కొనసాగాయి. నాలుగో స్థానంలో బ్రిటన్‌ నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ను సందర్శించిన ప్రధాని మోడీ.. సాహసాలు చేయాలనుకునేవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. ఈ పరిణామంతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతీశాయి.

ఇక గత మూడు వారాలుగా మాల్దీవుల టూరిస్ట్ లిస్ట్‌ను పరిశీలిస్తే అప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్‌ కొంతకాలంలోనే ఐదో స్థానానికి పడిపోయింది. కేవలం 13,989 మంది మాత్రమే మాల్దీవులను సందర్శించారు. 18,561 మంది పర్యాటకులతో రష్యా మొదటి స్థానంలో నిలిచింది. 18,111 మంది పర్యాటకులతో ఇటలీ రెండో స్థానానికి ఎగబాకింది. చైనా 16,529.. బ్రిటన్‌ 14,588 మంది పర్యాటకులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Jaswant Singh: కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్‌ ఇంట్లో విషాదం