Site icon NTV Telugu

Paris Olympics 2024: వరల్డ్ నెం.1 రెజ్లర్కు షాకిచ్చిన వినేష్ ఫోగట్..

Vinesh

Vinesh

పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది. ఫ్రీక్వార్టర్స్ లో 50 కేజీల విభాగంలో ప్రపంచ నంబర్ వన్, 2020 టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ జపాన్ రెజ్లర్ సుసాకితో తలపడి 3-2 తేడాతో విజయం సాధించింది. వినేష్‌కి ఇదే తొలి మ్యాచ్‌. ఈ మ్యాచ్ లో ఆమె అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత వినేష్ భావోద్వేగానికి గురైంది. ఒకానొక సమయంలో వినేష్ 0-2తో వెనుకంజలో ఉంది. చివరి 15 సెకన్లలో వినేష్ జపాన్ రెజ్లర్‌ను ఓడించి మూడు పాయింట్లు సాధించింది. వినేష్ కాస్త ఆలస్యంగా సెమీఫైనల్‌కు చేరుకుంది.

Exit mobile version