Site icon NTV Telugu

Attari Border: భర్త పాకిస్థానీ.. భార్య హిందుస్థానీ.. వారి పరిస్థితి గందరగోళం?

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. పాకిస్థానీయులను వివాహం చేసుకున్న చాలా మంది భారతీయ మహిళలు ఇబ్బందుల్లో పడ్డారు. పాకిస్థానీ వ్యక్తులను పెళ్లి చేసుకున్న హిందుస్థానీ మహిళలు.. భారత్‌లోని తమ ఇళ్లను విడిచిపెట్టి అత్తమామల ఇళ్లకు(పాక్) వెళ్లడానికి సిద్ధమయ్యారు. అలాంటి అనేక మంది మహిళలను అట్టారి-వాఘా సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్ దళాలు నిలిపి వేశాయి. బీఎస్ఎఫ్ ప్రకారం.. పాకిస్థానీయులు దేశం దాడి వెళ్లేందుకు ప్రభుత్వం 48 గంటల కాలపరిమితిని ఇచ్చింది. ఇందులో దాదాపు 287 మంది పాకిస్థానీ పౌరులు సరిహద్దు దాటి భారతదేశం నుంచి బయలుదేరారు. 191 మంది భారతీయులు తమ దేశానికి తిరిగి వచ్చారు.

READ MORE: Bollywood : భారీ బడ్జెట్ సినిమా నుండి కియారా ఔట్.. కృతి సనన్ ఇన్

38 ఏళ్ల భారతీయ జాతీయురాలు వాషిన్ జహంగీర్ హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడింది. తాను, తన సోదరి అత్తమామలు పాకిస్థాన్ నగరమైన కరాచీలో నివసిస్తున్నామని ఆమె చప్పింది. రెండు నెలల క్రితం.. ఆమె తన సోదరి కుమార్తెలతో కలిసి ఆస్తమా చికిత్స కోసం పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వచ్చింది. ఇప్పుడు ఆమె తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లేందుకు బార్డర్ వద్దకు చేరుకుంది. కాని వాషిన్ భారతీయ పౌరురాలు కావడంతో బీఎస్ఎఫ్ ఆమెను పాకిస్థాన్‌కు పంపేందుకు అనుమతించలేదు. అయితే.. ఆమె వెంట వీసాపై భారత్‌కు వచ్చిన పాకిస్థానీకి చెందిన మహిళలను మాత్రం తిరిగి పంపించారు.

READ MORE: Bilawal Bhutto: సింధూ నదిలో భారతీయుల రక్తం పారుతుంది.. భారత్‌పై భుట్టో పిచ్చికూతలు..

“నా భర్త, ఇద్దరు కుమారులు సరిహద్దు అవతల నా కోసం ఎదురు చూస్తున్నారు. నాకు పాకిస్థాన్ సగం పౌరసత్వం ఇచ్చింది. నా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ నన్ను ఆపేశారు. నన్ను నా భర్త, పిల్లల వద్దకు పంపండి” అని వాషిన్ జహంగీర్ వేడుకుంది. 48 గంటల గడువు ప్రకటించడంతో.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి అట్టారికి చేరుకోవడానికి తమకు దాదాపు లక్ష రూపాయలు ఖర్చయిందని ఆమె తెలిపింది. “పహల్గాంలో జరిగిన దాడుల పట్ల మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. కానీ దాడి చేసిన వారితో మాకు ఎటువంటి సంబంధం లేదు. మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు” అంటూ కన్నీరు పెట్టుకుంది.

READ MORE: Shehbaz Sharif: అన్నింటికీ పాకిస్థాన్ సిద్ధంగా ఉంది.. పాక్ ప్రధాని ప్రకటన

రాజస్థాన్ నివాసి వజీదా ఖాన్ విషయంలో ఇదే జరిగింది. ఆమె కూడా పాకిస్థాన్‌ వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఆమె వద్ద భారతీయ పాస్‌పోర్ట్ ఉండటంతో బీఎస్ఎఫ్ బలగాలు సరిహద్దు వద్ద ఆపేశాయి. ఈ అంశంపై వజీదా ఖాన్ మాట్లాడుతూ.. “నాకు 10 సంవత్సరాల క్రితం పాకిస్థాన్‌లో వివాహం జరిగింది. నాకు 7, 8 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ పాకిస్థాన్ పౌరులు. నన్ను బార్డర్‌లో ఆపడంతో వారిని నేను ఒంటరిగా పాకిస్థాన్‌లోని ఇంటికి పంపించాల్సి వచ్చింది. అమాయక ప్రజలను చంపిన వారిని శిక్షించాలి. కానీ మనలాంటి సామాన్యులను వేధించకూడదు” అని తెలిపింది.

Exit mobile version