NTV Telugu Site icon

Viral video: బస్సులో ఉండగా పురిటినొప్పులు.. డ్రైవర్ ఆలోచనతో సుఖంగా ప్రసవం..!

Bus

Bus

మనసుంటే మార్గముంటది అని పెద్దలు అంటుంటారు. అలాగే అపాయంలో ఉపాయం కలిగి ఉండడం కూడా చాలా అవసరం. ఇదంతా ఎందుకంటారా? ఓ బస్సు డ్రైవర్ చేసిన పనిని శెభాష్ అనకుండా ఉండలేరు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Eluru Crime: యువతిని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమోన్మాది మృతి!

బస్సు రన్నింగ్‌లో ఉంది. అందులో ఉన్న గర్భిణీకి ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. దీంతో అందులో ఉన్నవారంతా ఆందోళన చెందుతున్నారు. ఇంతలో డ్రైవర్.. తన పైఅధికారులకు సమాచారం అందించాడు. అంతే వారు కూడా వెంటనే అప్రమత్తమై ఆస్పత్రి వైద్యుల్ని అలర్ట్ చేశారు. ఈ సమాచారాన్ని అధికారులు.. డ్రైవర్‌కు చేరవేయడంతో నేరుగా బస్సును ఆస్పత్రి ఆవరణలోకి తీసుకొచ్చేశాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న డాక్టర్లు, నర్సులు బస్సు లోపలికి వెళ్లి పురుడు పోశారు. 27 ఏళ్ల మహిళ.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. మే 29న (బుధవారం) కేరళలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: జూన్‌ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లను హ్యాండోవర్ చేసుకోనున్న జీఏడీ..

మే 29న కేరళలోని త్రిసూర్ నుంచి కోజికోడ్‌కు బస్సు వెళ్తోంది. 37 ఏళ్ల మహిళకు ఒక్కసారిగా నొప్పులు వచ్చాయి. రవాణా సిబ్బంది, వైద్యులు, స్థానికులు సకాలంలో సహాయం అందించడంతో ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. త్రిసూర్‌లోని అమలా ఆస్పత్రి సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లు.. డ్రైవర్‌ తెగువను ప్రశంసిస్తున్నారు. ఇక తల్లి, బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. డెలివరీ తర్వాత తల్లి, శిశువు తదుపరి వైద్యం కోసం ఆస్పత్రిలో ఉన్నారు. ఆ వీడియో ఏంటో మీరు కూడా చూసేయండి.