Site icon NTV Telugu

US Student Visa Issues: డాలర్ డ్రీమ్స్‌కి ఇండియన్ స్టూడెంట్స్ దూరం.. అమెరికా కల చెదిరిపోడానికి కారణాలు ఇవే !

Us Student Visa Issues

Us Student Visa Issues

US Student Visa Issues: ఎంతో మంది విద్యార్థులకు కలల దేశం అమెరికా. ఉన్నత చదువులు చదువుకోడానికి విద్యార్థుల గమ్యస్థానంగా పరిగణించబడే అమెరికాలో యూనివర్సిటీలకు 2024–25 విద్యా సంవత్సరంలో భారత విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య భారీగా తగ్గిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఇటీవల అమెరికా రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో “ఓపెన్ డోర్స్” అనే ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో యూఎస్‌లోని యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో భారత విద్యార్థుల నమోదు 10 శాతానికి పడిపోయిందని వెల్లడైంది. 2025లో మెుత్తంగా విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు 17 శాతం తగ్గినట్లు ఈ డేటా పేర్కొంది.

READ ALSO: Balakrishna : వీడెందుకు వచ్చాడు.. అభిమానిపై బాలకృష్ణ ఫైర్

భారతీయ విద్యార్థుల తగ్గుదలకు కారణాలు..
ఈ సర్వేలో భాగమైన 825 అమెరికా సంస్థలు భాగం అయ్యాయి. ఇవన్నీ కూడా భారత విద్యార్థుల సంఖ్య 61 శాతం కంటే ఎక్కువ మంది తగ్గిందని వెల్లడించాయి. సర్వేలో పాల్గొన్న 96 శాతం సంస్థలు విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణలుగా వీసా ఫార్మాలిటీల్లో జాప్యం, కఠినమైన విధానాలు, అమెరికాకు ప్రయాణ పరిమితులని పేర్కొన్నాయి. ఇదే క్రమంలో కన్సర్వేటివ్ రిపబ్లికన్ ఎమ్మెల్యేలు H-1B వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలన్న ప్రతిపాదనలు తీసుకురావడం, కాంగ్రెస్‌మెంబర్ మార్జరీ టేలర్ గ్రీన్, వైద్య రంగం మినహా అన్ని విభాగాల్లో H-1B వీసాలను నిషేధించే బిల్లు ప్రవేశపెడతానని ప్రకటించడం వంటివి కూడా అమెరికా కలను నీరుగారేలా చేశాయని అంటున్నారు. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 6వేల మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా రాష్ట్ర విభాగం రద్దు చేయటం కూడా డాలర్ డ్రీమ్స్‌కి ఇండియన్స్‌ను దూరం చేస్తోందని ఈ సర్వే వెల్లడించింది.

అయితే ఇప్పటికీ అమెరికా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందుతున్న విదేశీయుల జాబితాలో ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. మొత్తం గ్రాడ్యుయేట్ విద్యార్థులలో దాదాపు సగం, అలాగే మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో మూడో వంతు భారతీయులే ఉన్నారు. గత ఏడాది ఈ సంఖ్య పెరిగినప్పటికీ.. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వ నిబంధనలతో ఈ సంఖ్య పడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Kanpur Scam: కోట్లు దోచుకున్న నిత్య పెళ్లికూతురు! బాధితుల్లో పోలీసులు, వైద్యులు మరెందరో..

Exit mobile version