Site icon NTV Telugu

Indian Student: లండన్‌లో భారత విద్యార్థి అదృశ్యం.. నదిలో శవమై కనిపించాడు

Indian Student

Indian Student

మూడు నెలల క్రితం బ్రిటన్ వెళ్లిన భారత విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. లండన్‌లోని థేమ్స్ నదిలో అతడు శవమై కనిపించాడు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన అతడు గత నెల నవంబర్ 17న కనిపించకుండ పోయాడు. దీంతో లండన్‌లోని అతడి బంధువులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నవంబర్ 21న లండన్​లోని థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు గుర్తించారు. అయితే అతడి హత్యగల కారణాలు తెలియాల్సి ఉంది. కానీ లండన్ పోలీసులు మాత్రం ఇది అనుమానస్పద మృతి కాదని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.

Also Read: Old Woman: కవలలకు జన్మనిచ్చిన70 ఏళ్ల వృద్ధురాలు

కాగా మిత్ పటేల్(23) ఈ ఏడాది ఉన్నత చదువుల కోసం సెప్టెంబర్‌లో లండన్ వెళ్లాడు. అక్కడ బంధువుల ఇంట్లో ఉంటున్న మిత్ షెఫీల్డ్​హాలమ్​వర్సిటీలో నవంబర్ 20న డిగ్రీ కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉంది. అప్పటికే అతడు అమెజాన్‌లో పార్ట్​టైమ్​ జాబ్​ కూడా సంపాదించాడు. ఈ క్రమంలో నవంబర్ 17 సాయంత్రం వాక్‌కు వెళ్లిన అతడు తిరిగి వెళ్లలేదు. దీంతో బంధువుల మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నవంబర్ 21 పటేల్ థేమ్స్ నదిలో పటేల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Suicide Attempt: వృద్ధుడిపై నుంచి వెళ్లిన రైలు.. అయినా బతికి బట్టకట్టాడు..

అనంతరం అతడి బంధువులకు సమాచారం అందించారు. కాగా పటేల్ మృతదేహాన్ని ఇండియాకు పంపేందుకు అతడి కుటుంబం నిధులు సేకరిస్తున్నట్టు బంధువు పార్త్ పటేల్ తెలిపాడు. ‘మిత్‌కుమార్ పటేల్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. దీంతో అతడి మ’తదేహం ఇండియాకు తీసుకురావడం కోసం అతడి తల్లిదండ్రులకు ఆర్థిక సాయం కోరుతున్నారు. ‘గో ఫండ్ మీ’ పేరుతో ఆన్‌లైన్ ఫండ్ రైజర్ ద్వారా నిధుల సేకరిస్తున్నారు. దీని ద్వారా వారం వ్యవధిలో జీబీపీ(గ్రేట్ బ్రిటన్ పౌండ్స్) 4,500కి(4 లక్షల 76 వేలు) పైగా వచ్చాయి’ అని చెప్పాడు.

Exit mobile version