Site icon NTV Telugu

London: యాక్సిడెంట్‌లో నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి మృతి

Rake

Rake

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి చీస్తా కొచ్చర్ (33) ప్రాణాలు కోల్పోయారు. లండన్‌ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కొచ్చర్ పీహెచ్‌డీ చేస్తున్నారు. యూనివర్సిటీ నుంచి ఇంటికి సైకిల్‌‌పై వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ట్రక్ ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన కొచ్చర్ అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. కొచ్చర్ మృతిని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

లైఫ్ ప్రోగ్రామ్‌లో చీస్తా కొచ్చర్ తమతో కలిసి పనిచేసిందని అమితాబ్ కాంత్ గుర్తుచేశారు. లైఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసేందుకు లండన్ వెళ్లారని… జీవితంలో మరింత ఉన్నత స్థానంలోకి వెళ్లాల్సిన సమయంలో విషాద ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. చీస్తా కొచ్చర్ చాలా తెలివైనవారని.. అంతేకాదు.. ఆమె చాలా ధైర్యవంతురాలు అని చెప్పుకొచ్చారు. ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఎక్స్‌లో అమితాబ్ కాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Surabhi : సింగర్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్..

మార్చి 19వ తేదీన చెత్త తీసుకెళ్లే ట్రక్ కొచ్చర్‌ను ఢీ కొంది. ఆ సమయంలో ఆమె భర్త అక్కడే ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో కొచ్చర్ అక్కడికక్కడే మృతిచెందారు. లండన్‌లో కొచ్చర్ కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ఘటన తమ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది అని చీస్తా కొచ్చర్ తండ్రి లెప్టినెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ లింక్‌డిన్‌లో రాసుకొచ్చారు. గత ఏడాది సెప్టెంబర్‌లో చీస్తా దంపతులు లండన్ వెళ్లారు. అంతకుముందు గురుగ్రామ్‌లో నివసించారు. ఢిల్లీ యూనివర్సిటీ, అశోక వర్సీటి, యూనివర్సిటీస్ ఆఫ్ పెన్సిల్వేనియా, చికాగోలోనూ చీస్తా కొచ్చర్ చదువుకున్నారు. 2021-23 వరకు నీతి ఆయోగ్‌లో నేషనల్ బిహేవియరల్ ఇన్ సైట్స్ విభాగంలో సీనియర్ సలహాదారుగా పనిచేశారని లింక్‌డిన్ ప్రొఫైల్‌లో రాసుకున్నారు.

 

Exit mobile version