NTV Telugu Site icon

Stock Markets: మరోమారు భారీ నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్స్

Stock Market

Stock Market

Stock Markets: స్టాక్‌ మార్కెట్లు ఆర్థిక వ్యవస్థలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ స్టాక్ మర్కెట్స్ ద్వారా పెట్టుబడిదారులు వారి డబ్బును వృద్ధి చేసుకోవడానికి కంపెనీలకు మూలధనాన్ని సేకరించడానికి వేదికగా నిలుస్తాయి. ఇక భారత్ లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు. ఇకపోతే, నేడు (గురువారం) దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా లాంగ్ వీకెండ్ ముందు ఇన్వెస్టర్లు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండటంతో ఈక్విటీ సూచీలు భారీగా పడిపోయాయి.

Read Also: TOSS: తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ ఇలా..

మరోవైపు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలపై అనిశ్చితి వెంటాడడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు. ఇక నేడు బీఎస్ఈ సెన్సెక్స్ 74,401 పాయింట్లతో ప్రారంభమై ఒకనాక దశలో 73,771 పాయింట్లకు పడిపోగా.. చివరికి, 201 పాయింట్ల నష్టంతో 73,829 పాయింట్ల వద్ద ముగిసింది. దీనితో ఈ వారంలో సెన్సెక్స్ మొత్తం 504 పాయింట్లు కుప్పకూలింది.

Read Also: IPL History: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ స్టార్లు ఎవరో తెలుసా?

ఇక మరోవైపు నిఫ్టీ విషయానికి వస్తే.. నేడు 22,558 పాయింట్ల వద్ద మొదలై 22,377 పాయింట్లకు చేరుకొని, చివరకు 73 పాయింట్ల నష్టంతో 22,397 పాయింట్ల వద్ద ముగిసింది. దీనితో మొత్తంగా ఈ వరం నిఫ్టీ 156 పాయింట్లు నష్టపోయింది. ఇక నేడు ప్రధానంగా జొమాటో, టాటా మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు ప్రధానంగా నష్టపోగా.. ఎస్బిఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్టీపీసీ, సన్‌ ఫార్మా, టాటాస్టీల్‌ షేర్లు స్వల్పనగా లాభల బాట పట్టాయి.