NTV Telugu Site icon

Nirmala Sitaraman: రూపాయి పడిపోవట్లేదు.. డాలర్ బలపడుతోంది

Nirmala

Nirmala

Nirmala Sitaraman: రూపాయి విలువ రోజురోజుకు పడిపోతూనే ఉంది. శుక్రవారం నాటికి రూపాయి విలువ డాలర్‌ తో పోలిస్తే 82.30 వద్ద ట్రేడయింది. గురువారం కన్నా 81.89 నుండి 0.5 శాతానికి తగ్గి.. ఆల్‌టైమ్‌ కనిష్టానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడంతో రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. రూపాయి శుక్రవారం డాలర్‌తో పోలిస్తే 82.22 వద్ద సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. ఏకంగా 33 పైసలు పడిపోయింది. ఫెడ్‌ రేట్ల పెంపులతో అమెరికా విదేశీ డబ్బును భద్రతకు తరలించే క్రమంలో ఈ ఏడాదిలో రూపాయి విలువ ఏకంగా 10.6% క్షీణించింది. మొత్తంగా 82 రూపాయిల మార్క్‌ను కూడా దాటేసింది. పెరుగుతున్న చమురు ధరలు, యుఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ రేటు పెంపు ప్రచారం కారణంగా ఈ ఏడాది గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే.. రూపాయి రికార్డు కన్నా కనిష్ట స్థాయికి చేరుకుంటుందని రాయిటర్స్‌ నివేదిక పేర్కొంది. డాలర్‌ ఇండెక్స్‌, ఆరు కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్‌ ట్రాక్‌ చేస్తుంది. డాలర్‌ 0.14శాతం తగ్గి 112.10 వద్ద ట్రేడవుతోంది.

డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోవడానికి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు పెరగడమే కారణమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. దీన్ని ఎదుర్కోవటానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాణిజ్య లోటు ప్రతిచోటా పెరుగుతోందని, దానిపై తాము దృష్టిసారించామన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మల వాషింగ్టన్ డీసీలో మీడియాతో మాట్లాడారు.

Read Also: Delhi Liquor Scam: మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు.. “సత్యమేవ జయతే” అంటూ సిసోడియా ట్వీట్

ఇది ఇలా ఉంటే…. రూపాయి క్షీణించడం లేదని.. డాలర్ బలపడుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థ, కరెన్సీలతో పోలిస్తే రూపాయి చాల మెరుగ్గానే ఉందన్నారు. రూపాయి విలువను స్థిరీకరించడానికి ఆర్‌బిఐ ప్రయత్నిస్తోందని అన్నారు. భారతీయ కరెన్సీ విలువను నిర్ణయించడానికి మార్కెట్‌లో జోక్యం చేసుకోవడం లేదని అన్నారు. యుద్ధం నిత్యావసరాల ధరలను పెంచిందని, అభివృద్ధి చెందిన దేశాలలో ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో పెరగడానికి దారితీసిందని అన్నారు.