Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways Travel Insurance: దివాళీ పండుగకు ముందు భారతీయ రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త అందించబోతోంది. ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉన్న ప్రయాణ బీమా (ట్రావెల్ ఇన్సూరెన్స్) సౌకర్యం, త్వరలోనే రైల్వే స్టేషన్ కౌంటర్లలో నేరుగా టికెట్లు కొనుగోలు చేసే వారికి కూడా అందుబాటులోకి రానుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల మేరకు అక్టోబర్ 27 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. తక్కువ ఖర్చుతో, సురక్షితమైన ప్రయాణానికి అత్యధిక మంది ప్రాధాన్యత ఇచ్చేది రైలు ప్రయాణానికే. అయితే ఇప్పటివరకు ఐఆర్సిటిసి (IRCTC) వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో మాత్రమే ప్రయాణికులు బీమా ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం ఉండేది. రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ తీసుకునే ప్రయాణికులకు ఈ సదుపాయం లభించేది కాదు.
జూన్ 2023లో ఒడిశాలో జరిగిన తీవ్ర రైలు ప్రమాదం తర్వాత, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఈ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. అక్టోబర్ 6న న్యాయమూర్తులు అహ్సానుద్దీన్ అమానుల్లా, ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచ్చింది. స్టేషన్ కౌంటర్లలో విక్రయించే అన్ని రకాల టికెట్లకూ ఈ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని వర్తింపజేయాలని స్పష్టం చేసింది. డిజిటల్ సేవలపై అవగాహన లేక లేదా వాటిని ఉపయోగించక నేరుగా కౌంటర్ వద్ద టికెట్ తీసుకునే వారిని కూడా ఆన్లైన్ ప్రయాణికులతో సమానంగా చూడాలని, వారికీ ఈ భద్రత కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ నిబంధనను అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా రైల్వే బోర్డునే నేరుగా బాధ్యులను చేస్తామని ధర్మాసనం హెచ్చరించింది. ఇక, ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో అమల్లో ఉన్న ప్రయాణ బీమా పథకం ప్రకారం.. ఒకవేళ ప్రమాదం జరిగి ప్రయాణికుడు మరణించినా లేదా పూర్తిగా వైకల్యానికి గురైనా గరిష్టంగా రూ.10 లక్షల వరకు పరిహారం అందుతుంది. దీని కోసం ఆన్లైన్లో కేవలం 45 పైసలు మాత్రమే (పన్నులతో కలిపి) ప్రీమియంగా వసూలు చేస్తున్నారు. అయితే, కౌంటర్లో టికెట్ బుక్ చేసుకునే వారికి ఈ ప్రీమియం ఎంత ఉంటుంది, దరఖాస్తుకు ఎలాంటి పత్రాలు అవసరం, క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే వివరాలను రైల్వే శాఖ త్వరలోనే పూర్తిస్థాయిలో వెల్లడించనుంది. భౌతిక కౌంటర్లపై ఆధారపడే ప్రయాణికులకు, డిజిటల్ సేవలకు దూరంగా ఉండే వారికి ఇది ఎంతో మేలు చేసే నిర్ణయం.
Also Read
- AP ZPTC, MPTC Elections 2026: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్లు, పోలింగ్, కౌంటిగ్ పూర్తి వివరాలు..
- Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
- Surya Kumar Yadav: టీమిండియా నుంచి డ్రాప్.. ఆ టోర్నీలో సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్..
- CM Devendra Fadnavis: "నిందితులను వదిలిపెట్టం".. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనపై సీఎం ఫడ్నవీస్ ఫైర్..
తాజావార్తలు
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్..!
-
RAPO 23: టాలీవుడ్లోకి రితీష్ దేశ్ ముఖ్
-
Chris Gayle Catch: 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
-
AP ZPTC, MPTC Elections 2026: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్లు, పోలింగ్, కౌంటిగ్ పూర్తి వివరాలు..
-
Thiruvananthapuram Airport: అరుదైన సంప్రదాయం.. అక్టోబర్ 20న 5 గంటల పాటు విమానాలు నిలిపివేత..!
ట్రెండింగ్
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?