Indian Railway Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో భారీగా ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. గత కొంతకాలంగా ఎలాంటి జాబులు లేకుండా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. వెస్ట్రన్ రైల్వేకు చెందినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. రైల్వేలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి సర్కార్ తీపి కబురు చెప్పింది.. వెస్ట్రన్ జోన్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 3624 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు rrc-wr.com వెబ్ సైట్లో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు..అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 27 నుంచి దరఖాస్తులను తీసుకోగా.. దరఖాస్తు చేసుకోవడానికి జులై 26ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది..
ఈ ఉద్యోగాలకు అర్హతలు..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా సంబంధిత ట్రేడ్ నుంచి ఐటిఐ సర్టిఫికెట్ ను పొంది ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన బోర్డు నుంచి తప్పనిసరిగా 50 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. సంబంధిత ట్రేడ్ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 26 నాటికి 15-24 ఏళ్లు ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారంటే.. ముందుగా మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు..
ఇకపోతే.. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PWD/Women అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థులు డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్ నెట్ బ్యాంక్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఉద్యోగాలను భారీగానే రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది.. ఆసక్తి, అర్హత కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!