NTV Telugu Site icon

Indian Railway: ఇంత టాలెంటెడ్ గా ఉన్నారెంట్రా బాబు.. చలికాచుకోడానికి ట్రైన్లో నిప్పేంట్రా..?

Train

Train

ఉత్తరప్రదేశ్‌లో కదులుతున్న రైలులో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. చలి నుంచి తప్పించుకునేందుకు కొందరు ప్రయాణికులు ట్రైన్ భోగిలోనే మంటలు వేశారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే సీఆర్పీఎఫ్ సిబ్బంది ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, అస్సాం నుంచి ఢిల్లీకి వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే జనరల్ కోచ్ కంపార్ట్‌మెంట్ నుంచి పొగలు రావడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమైంది. అక్కడికి చేరుకోగానే ట్రైన్ భోగిలో మంటలు కాల్చుతున్న ప్రయాణికుల గుంపు కనిపిచింది. అది చూసిన పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే మంటలు ఆర్పివేశారు. విచారణ కోసం చందన్, దేవేంద్ర అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని అలీగఢ్‌లోని ఆర్‌పీఎఫ్ పీఎస్ కు తరలించారు.

Read Also: Btech Student: బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య ఘటన.. పటాన్‌ చెరు డీఎస్పీ వివరణ..

అయితే, నిందితులిద్దరూ ఫరీదాబాద్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. అయితే, సదరు యువకుల దగ్గర ఆవు పిడకలు చూసి వారు ఆశ్చర్యపోయారు. కదులుతున్న రైలులో చలి విపరీతంగా ఉండడంతో మంటలు వేయాల్సి వచ్చిందని యువకులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ విషయంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Read Also: Japan Earthquake : జపాన్ లో భూకంపం.. విశాఖలో వెనక్కి వెళ్లిన సముద్రం

చలి నుంచి కాపాడుకునేందుకు తాము ట్రైన్ భోగిలో మంట వెలిగించామని ఆర్పీఎఫ్ సిబ్బందికి తెలిపారు. నిందితులను రైల్వే చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు ఆర్పీఎఫ్ అలీఘర్ పోస్ట్ కమాండర్ రాజీవ్ శర్మ చెప్పారు. వీరితో పాటు మరో 14 మంది ప్రయాణికులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామన్నారు. ట్రైన్ లో కానీ, రైల్వే ప్లాట్‌ఫారమ్, రైల్వే స్టేషన్ సమీపంలో అలాంటివి విక్రయించకూడదని పేర్కొన్నారు.