NTV Telugu Site icon

Singapore: గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను కొట్టి చంపిన బాయ్ ఫ్రెండ్.. 20 ఏళ్ల జైలు శిక్ష

Singapuram

Singapuram

సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన 40 ఏళ్ల వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. తన ప్రియురాలి యొక్క హత్యకు కారణం కావడంతో ఆ వ్యక్తికి ఈ శిక్ష విధించబడింది. అయితే, ఎం కృష్ణన్‌కు వివాహం జరిగింది. అయితే, తన స్నేహితురాలు ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకోవడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. ఇది తెలుసుకున్న అతను మల్లికా బేగంను కొట్టి, తన్నాడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. 2019 జనవరి 17వ తేదీన మృతి చెందింది. ఇక, సదరు వ్యక్తి గత వారం హైకోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు.

Read Also: CM Revanth Reddy: నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం పర్యటన.. బావోజీ జాతరకు హాజరు

ఇక, జస్టిస్ వాలెరీ థైన్ మాట్లాడుతూ.. కృష్ణన్ పదే పదే తన భార్యను, స్నేహితురాలిని వేధించినట్లు న్యాయమూర్తి తన తీర్పులో వెల్లడించింది. మల్లికా బేగంను చంపేసిన కూడా తనలో కోపం ఇంకా తగ్గలేదని చెప్పారు. చేసిన తప్పుకు తగిన శిక్షను విధించినట్లు పేర్కొన్నారు. ఇక, మహిళలపై అతను పదేపదే గృహహింసకు పాల్పడటం జరిగింది.. ఇలాంటి ఘటనను ఉపేక్షించలేమని పేర్కొన్నారు. కాగా, డొమెస్టిక్ వాయిలెన్స్ కు పాల్పడ్డిన కృష్ణన్‌కు 20 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.

Show comments