NTV Telugu Site icon

Indian Navy: ముంబై తీరంలో ‘ధృవ్’ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Indian Navy

Indian Navy

Indian Navy: ఇండియన్‌ నేవీకి చెందిన ఓ తేలికపాటి హెలికాప్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇండియన్ నేవీ హెలికాప్టర్ ఈరోజు ముంబై తీరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) రొటీన్ ఫ్లయింగ్ మిషన్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. దీంతో హెలికాప్టర్‌ను ముంబయి తీరంలో అత్యవసరంగా నీటిపై ల్యాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ‘ధృవ్’ హెలికాప్టర్‌లోని ముగ్గురు సిబ్బందిని రక్షించినట్లు భారత నావికాదళం తెలిపింది.

Read Also: Using earphones too much: ఇయర్‌ ఫోన్స్‌ టూ… మచ్‌ గా వాడితే మీరు డేంజర్‌లో పడినట్లే

ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన అధికారులు.. పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపించి వారిని కాపాడారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. అరేబియా సముద్రం మీదుగా వెళ్తున్న సమయంలో సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ అకస్మాత్తుగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

 

Show comments