Site icon NTV Telugu

Indigenous Anti Submarine: నేవీ సామర్థ్యంలో కీలక పురోగతి.. యాంటీ-సబ్‌మేరిన్‌ రాకెట్‌ పరీక్ష విజయవంతం..!

Indigenous Anti Submarine

Indigenous Anti Submarine

Indigenous Anti Submarine: భారత నౌకాదళానికి సంబంధించి భారీ విజయంగా నిలిచే మరో అడుగు ముందుకువేసింది. పూర్తి స్థాయిలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఎక్స్‌టెండెడ్ రేంజ్ యాంటీ-సబ్‌మేరిన్ రాకెట్ (ERASR) ను విజయవంతంగా పరీక్షించామని అధికారికంగా ప్రకటించారు. జూన్ 23 నుండి జూలై 7 వరకు యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కవరట్టి నుంచి ఈ ప్రయోగాలు నిర్వహించబడ్డాయి.

Read Also:ATM Robbery: జీడిమెట్లలో రెచ్చిపోయిన దొంగలు.. గంటలో మూడు ATMలు కొల్లగొట్టిన కేటుగాళ్లు..!

ఈ పరీక్షల విజయంపై రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. DRDO, భారత నౌకదళాలు ఇంకా ఈ అభివృద్ధిలో భాగమైన పరిశ్రమలన్నింటినీ అభినందించారు. ఈ వ్యవస్థ విజయవంతంగా సేవలోకి రావడం భారత నౌకాదళ దాడి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది అని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇకపోతే, ఈ యాంటీ-సబ్‌మేరిన్ రాకెట్ వ్యవస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. దీని ప్రత్యేకత ట్విన్-రాకెట్ మోటార్ కన్ఫిగరేషన్. ఇది విస్తృత శ్రేణి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో, స్థిరతతో కొట్టగలగడం. దీనివల్ల సముద్రపు లోతుల్లో దాగున్న శత్రు సబ్‌మేరిన్లను సమర్థవంతంగా ధ్వంసం చేయవచ్చు.

Read Also:AI+ Smartphone Launch: మార్కెట్లోకి దేశీ స్మార్ట్‌ఫోన్‌.. బెస్ట్ ఫీచర్స్, ధర కేవలం 5 వేలే!

తాజాగా మొత్తం 17 ERASR రాకెట్లు వివిధ పరిధుల్లో విజయవంతంగా పరీక్షించబడ్డాయి. రేంజ్ పనితీరు, ఎలక్ట్రానిక్ టైం ఫ్యూజ్ పనితీరు, వార్‌హెడ్ ఫంక్షనింగ్‌ వంటి అన్ని నిర్దిష్ట లక్ష్యాలు సాఫల్యంగా సాధించబడ్డాయని భారత నౌకాదళం తెలిపింది. ఈ రాకెట్ వ్యవస్థ ఇండక్షన్ తరువాత, భారత నౌకాదళం అండర్‌ వాటర్ యుద్ధరంగంలో మరింత సన్నద్ధంగా ఉండనుంది. శత్రు సబ్‌మేరిన్లను సమర్థంగా గుర్తించి ధ్వంసించగల ఈ ఇండిగేనోస్ టెక్నాలజీ భారత్ స్వయం సమర్థతను నిరూపించింది.

Exit mobile version