Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Navy: భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. నేవీ (Navy) కోసం ఏకంగా ఎనిమిది నెక్స్ట్-జెనరేషన్ స్టెల్త్ నౌకల (నెక్స్ట్-జెనరేషన్ కార్వెట్లు – NGC) నిర్మాణానికి రూ.40,000 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో రక్షణ రంగంలో అత్యున్నత స్థాయిలో క్లియరెన్స్ సాధించిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఇది ఒకటి. దీనికి సంబంధించిన అధికారిక ఒప్పందాలు కూడా కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE), గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL)లతో త్వరలోనే రూపుదిద్దుకోనున్నాయి.
అసలు ఏమిటీ కార్వెట్ యుద్ధనౌకలు?
సాధారణంగా కార్వెట్లు అంటే పరిమాణంలో ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్ల కంటే కాస్త చిన్నవిగా, అత్యంత వేగంగా ప్రయాణించే శక్తివంతమైన యుద్ధనౌకలు. తీరప్రాంత రక్షణ, నిఘా, సముద్రపు పహారా కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చిన్నవిగా ఉన్నప్పటికీ, అనేక రకాల అధునాతన ఆయుధాలను, అత్యాధునిక సెన్సార్లను ఇవి మోసుకెళ్లగలవు. భారత నౌకాదళం కోసం రూపొందించబోయే ఈ కొత్త తరం కార్వెట్లు దాదాపు 2,000 టన్నుల బరువుతో, గంటకు 30 నాట్ల వేగంతో ప్రయాణించగలవు. మన ఇండియన్ నేవీ సొంతంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ స్టెల్త్ డిజైన్, నవీన సాంకేతికతలతో ఇవి నిర్మాణం కానున్నాయి. శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండేలా రూపుదిద్దుకుంటున్న ఈ నౌకలు గాల్లో ఉన్న శత్రువులను, నీటిపైన ప్రయాణించే నౌకలను, అలాగే నీటి లోపల దాగి ఉండే జలఅంతర్గాములను (సబ్మెరైన్లు) ఎదుర్కొనే ఆల్ రౌండ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
Also Read
- World Bank Report: పేదరిక నిర్మూలనలో భారత్ రికార్డు.. 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి విముక్తి.. కానీ..
- Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
- Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
- AB Venkateswara Rao: విజయవాడలో ఏబీవీ ప్రచార వాహనాలపై దాడి.. పోస్టర్లు చించివేత!
ఈ భారీ ప్రాజెక్ట్ విశేషమేమిటంటే.. ఇందులో 70 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని, వస్తువులనే ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘సాగర్’ (SAGAR) విజన్‌కు ఇది మరింత ఊతాన్ని ఇస్తుంది. రూ.40,000 కోట్లపైగా వ్యయంతో నిర్మించే ఈ నౌకల బాధ్యతను కోల్‌కతాకు చెందిన జిఆర్ఎస్ఈ, గోవా షిప్‌యార్డ్ పంచుకోనున్నాయి. దీనివల్ల ఈ రెండు దిగ్గజ షిప్‌యార్డ్‌ల ఆర్డర్ బుక్ బలోపేతం అవ్వడమే కాకుండా, మన దేశంలోని అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు) పనులు లభించి, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక, ఈ యుద్ధనౌకల నిర్మాణ ప్రక్రియ ఏడాది లోపే ప్రారంభం కానుంది. ఇందులో మొదటి నౌకను 2030 నాటికి భారత నౌకాదళానికి అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో, సరిహద్దులను మరింత భద్రంగా ఉంచుకునేందుకు నేవీ తన బలగాలను నిరంతరం ఆధునికీకరిస్తోంది. ఇప్పటికే ఉన్న నీలగిరి-క్లాస్ ఫ్రిగేట్లు, కొత్త తరం డిస్ట్రాయర్లు, ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ల శ్రేణికి ఈ కొత్త స్టెల్త్ కార్వెట్లు తోడైతే భారత నౌకాదళానికి సముద్రంపై తిరుగులేని శక్తి లభిస్తుంది.
తాజావార్తలు
-
Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
-
PM Modi’s Big Statement: దేశాభివృద్ధి కొంతమందికి నచ్చడం లేదు.. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ఫైర్
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Terror Funding Case: జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ ఫండింగ్ ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్
-
World Bank Report: పేదరిక నిర్మూలనలో భారత్ రికార్డు.. 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి విముక్తి.. కానీ..
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!