NTV Telugu Site icon

Dubai Lottery ticket: డామిట్ కథ అడ్డంతిరిగింది.. లక్ వచ్చి తలుపు కొట్టినా తీయడేంటి..

Millinium

Millinium

Dubai Lottery ticket: లక్ష్మీ దేవి ఎవరి తలుపు ఎప్పుడు కొడుతుందో ఎవరికీ తెలియదు. అయితే కొట్టినప్పుడు వెంటనే తలుపు తెరవాలి లేకపోతే కష్టం. అలాగే జరిగింది ఓ వ్యక్తికి. దుబాయ్ లో లాటరీ టిక్కెట్లు ఎక్కువగా కొంటూ ఉంటారు మన భారతీయులు. ఎక్కువగా మనవారికే లాటరీలు తగులుతూ ఉంటాయి కూడా. ఇలా సరదాగా కొన్న ఓ లాటరీ టికెడ్ మన భారతీయుడు ఒకరిని కోటీశ్వరుడిని చేసింది. సయ్యద్ అలీ అనే వ్యక్తి సరదాగా ఓ లాటరీ టికెట్ కొన్నాడు. అయితే దీనిని  అతడు ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడు. అయితే బుధవారం తీసిన డ్రాలో ఆన్లైన్లో కొన్న టికెట్ కు లక్కీ డ్రా తగిలింది.

Also Read: Crime News: మద్యం తాగి వచ్చాడని మందలించినందుకు.. తల్లిని చంపి నాలుక కోసిన కిరాతకుడు

లాటరీ లక్కీ డ్రాలో భారతీయుడుకి రూ. 8.22 కోట్లు దక్కాయి. అంటే అతడు దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్ లాటరీలో జాక్ పాట్ కొట్టాడు. దీంతో అతడు రాత్రికి రాత్రే కోటిశ్వరుడు అయ్యాడు. అయితే ఇక్కడే ఒక కొసమెరుపు ఉంది. అతడు ఆన్ లైన్ లో ఇచ్చిన నంబర్ కు ఫోన్ చేస్తుంటే అది కలవడం లేదు. ఎన్ని సార్లు కాల్ చేసినా ఫలితం లేకుండా పోయింది. అతని ఇతను ఆగస్టు 30వ తేదీన 4392 నెంబర్ గల లాటరీ టికెట్ ను ఆన్ లైన్ లో కొన్నాడని నిర్వాహకులు తెలిపారు. అయితే అతడిని కాంటాక్ట్ కావడానికి వేరే మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని కంపెనీ వారు తెలిపారు. ఈ విషయం తెలిసిన వారు లక్ తలుపు తట్టినప్పుడే తెరవాలి. అతడు ఇప్పుడు కంపెనీ వాళ్లకు దొరుకుతాడో లేదో అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా మరో భారతీయుడికి లాటరీ రావడం ఆనందించాల్సిన విషయం. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లాటరీ టికెట్స్ 1999లో ప్రారంభమైంది. ఈ టికెట్లు కొన్న వారిలో చాలా మంది భారతీయులే ఉన్నారు. అందులో ఇప్పటి వరకు మిలియన్ డాలర్ ను గెలుచుకున్న వారు 25 మంది.  ఇప్పటివరకు ఒక మిలియన్ డాలర్ గెలుచుకున్న భారతీయుల్లో సయ్యద్ అలీ 25వ వ్యక్తిగా నిలిచాడని నిర్వాహకులు తెలిపారు.