Site icon NTV Telugu

Indian Kabaddi Coach: ఫిలిప్పీన్స్‌లో భారత కబడ్డీ కోచ్‌పై కాల్పులు

Indian Kabaddi Coach

Indian Kabaddi Coach

Indian Kabaddi Coach: పంజాబ్‌లోని మోగాకు చెందిన కబడ్డీ కోచ్ గురుప్రీత్ సింగ్ గిండ్రు (43) మంగళవారం ఫిలిప్పీన్స్ రాజధాని నగరంలో కాల్చి చంపబడ్డాడని మనీలా పోలీసులు తెలిపారు. గురుప్రీత్ తన జీవనం కోసం నాలుగేళ్ల క్రితం ఫిలిప్పీన్స్ వెళ్లాడు. 43 ఏళ్ల వయసు గల ఆయన పని నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు తలపై కాల్చి చంపారు.

Delhi Car Horror: ఢిల్లీ యువతి కేసులో ట్విస్ట్.. అసలు నిధి స్నేహితురాలే కాదట!

మనీలా పోలీసులు స్థానిక మీడియాకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. దాడి చేసిన వారిని గుర్తించలేదు, కబడ్డీ కోచ్ గురుప్రీత్‌ను దుండగులు ఎందుకు కాల్చి చంపారు అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో కెనడాలోని అంటారియోలో పంజాబ్‌కు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. మోహిత్ శర్మ (28) ఏకాంత ప్రదేశంలో కారు వెనుక సీటులో శవమై కనిపించాడు. ముఖ్యంగా, విదేశాలలో ప్రవాస భారతీయులపై విద్వేషపూరిత నేరాల నివేదికలు పెరుగుతున్నాయి. యూకేలో ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అభిమానుల మధ్య ఘర్షణతో ముగిసిన తర్వాత లీసెస్టర్ నగరంలో రోజుల తరబడి నిరసనలు, అల్లర్లు, విధ్వంసాలను చూసింది. అది రోజుల తరబడి మత ఘర్షణగా మారింది. కెనడాలోనూ భారతీయులపై దాడులు జరిగాయి. గతేడాది అనేక ఘటనల అనంతరం భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.

 

Exit mobile version