Site icon NTV Telugu

Khalistan Terrorist: పన్నూ హత్యకు భారత ప్రభుత్వ ఉద్యోగి కుట్ర.. అమెరికా సంచలన ఆరోపణలు..

Gurpatwant Singh Pannun

Gurpatwant Singh Pannun

Khalistan Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ హత్య కుట్ర వ్యవహారం భారత్-అమెరికాల మధ్య కొత్త చర్చకు దారి తీసింది. పన్నూను హత్య కుట్రలో భారత ప్రమేయం ఉందని, ఆ కుట్రను భగ్నం అమెరికా భగ్నం చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ వ్యవహరాన్ని అమెరికా, అత్యున్నతస్థాయిలో భారత్‌కి తెలియజేసింది. అయితే భారత్ ఇది తమ విధానం కాదని చెప్పింది. ఈ నేపథ్యంలో భారతీయుడైన నిఖిల్ గుప్తా అనే వ్యక్తి పన్నూ హత్యకు కుట్ర పన్నారని, అందుకోసం డబ్బులు ఇచ్చారని అమెరికా ఆరోపిస్తోంది.

అయితే ఈ హత్య ప్రమేయంలో ఓ భారత ప్రభుత్వ ఉద్యోగి కీలకంగా వ్యవహరించారని, అతనే పథకం పన్నారని అమెరికాలోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. గురువారం రోజు యూఎస్ న్యాయశాఖ మరో భారతీయులు నిఖిల్ గుప్తాపై నేరారోపణలు చేసింది. ఈ కేసులో నేరం రుజువైతే 10-20 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.

మాన్‌హట్టన్ కోర్టులో దాఖలు చేసిన నేరారోపణ పత్రాల ప్రకారం.. నిఖిల్ గుప్తా అలియాస్ నిక్ అనే 52 ఏళ్ల వ్యక్తి ఖలిస్తానీ సంస్థ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూని హత్య చేసేందుకు ఒక ప్రణాళికలో భారత ప్రభుత్వ ఏజెన్సీ ఉద్యోగితో కుమ్మక్కయ్యాడని పేర్కొంది. భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరుడు పన్నూను అమెరికన్ గడ్డపైనే హత్య చేయాలనే కుట్ర జరిగిందని ఆ దేశం ఆరోపిస్తోంది. పన్నూకి అమెరికా-కెనడా ద్వంద్వం పౌరసత్వం ఉంది. న్యూయార్క్ నగరంలో యూఎస్ పౌరుడిని హత్య చేయడానికి కుట్ర పన్నారని న్యూయార్క్ సదరన్ డిస్ట్రక్ట్ యూఎస్ అటార్నీ డామియన్ విలియమ్స్ ఓ ప్రకటనలో తెలిపారు.

Read Also: Dharmana Prasada Rao: ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి ధర్మాన లేఖ

కెనడాలోని సర్రే ప్రాంతంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన నేపథ్యంలో తాజాగా అమెరికా నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. తాజా ఆరోపణల్లో భారత ప్రభుత్వం ఉద్యోగి హ్యాండ్లర్‌గా ఆరోపించబడుతున్నారు. CC-1గా పేర్కొనబడిన, పేరు తెలియని భారత్‌కి చెందిన వ్యక్తి పన్నూని చంపేందుకు ప్రణాళిక రూపొందించాడని, మే 2023లో హత్య చేసేందుకు నిఖిల్ గుప్తాను నియమించుకున్నాడని అమెరికా కోర్టు పత్రం పేర్కొంది.

గుజరాత్‌లో నిఖిల్ పై ఉన్న క్రిమినల్ కేసు కొట్టివేస్తామనే హామీ ఇవ్వడంతోనే గుప్తా ఈ ప్రణాళికకు అంగీకరించడాని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. భారత ప్రభుత్వం ఉద్యోగి అతనికి హామీ ఇవ్వడంతోనే ఈ ప్లాన్‌లో చేరారని, అతను గుప్తాకు, గుజరాత్ డీసీపీ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ప్రతిపాదించినట్లు అందులో పేర్కొంది.

జూన్ 9, 2023న CC-1 అనే వ్యక్తి, గుప్తా హత్య కోసం న్యూయార్క్ మాన్‌హట్టన్ లో హంతకుడికి 15,000 డాలర్లను ముందుస్తుగా ఇచ్చారని పేర్కొంది. హత్యను వీలైనంత త్వరగా ముగించాలని నిఖిల్ గుప్తా హంతకుడిని ఆదేశించారని, అయితే అమెరికా, భారత ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారుల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో హత్య చేయవద్దని గుప్తా, అతనికి సూచించాడని అభియోగాల్లో పేర్కొన్నారు. జూన్21-23 తేదీల్లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలోనే హత్య పథకాన్ని నిలిపివేసినట్లు తెలిపింది.

Exit mobile version