Site icon NTV Telugu

Indian Cricketers Retirement 2025: రో-కోతో పాటు 2025లో రిటైర్ అయిన భారత ఆటగాళ్ల జాబితా ఇదే..

Cricketers Retirement 2025

Cricketers Retirement 2025

Indian Cricketers Retirement 2025: ఇండియాలో క్రికెట్ అంటే ఒక ఎమోషన్. చాలా మంది అభిప్రాయంలో దేశంలో క్రికెట్ అనే ఒక మతం ఉంటే చాలా మంది ఈ మతాన్ని ఆరాధించే వారని చెబుతారు. అంతలా ప్రేమిస్తారు చాలా మంది ఇండియన్స్ క్రికెట్‌ను. అలాంటిది ఈ ఏడాదిలో చాలా మంది దిగ్గజ క్రికెటర్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది ముగింపునకు చేరువ కావడంతో 2025లో ఇప్పటి వరకు రిటైర్ అయిన భారత ఆటగాళ్లు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Benin: మరో ఆఫ్రికన్ దేశంలో తిరుగుబాటు.. సైన్యం చేతిలోకి పవర్..

రిటైర్‌మెంట్ ప్రకటించిన వాళ్లు వీరే..

రోహిత్ – కోహ్లీల టెస్ట్ రిటైర్మెంట్..
ఈ సంవత్సరంతో భారత టెస్ట్ క్రికెట్‌లో రోహిత్-కోహ్లీ శకం ముగిసింది. మే 7, 2025న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ప్రకటన వెలువడిన మూడు రోజుల తర్వాత మే 10, 2025న విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వీళ్లిద్దరూ 2024 లో T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ దిగ్గజ ఆటగాళ్లిద్దరూ ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో ఆడుతున్నారు.

చెతేశ్వర్ పుజారా, వృద్ధిమాన్ సాహా ..
భారత టెస్ట్ జట్టుకు పెట్టని గోడలా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయిన పేరు చతేశ్వర్ పుజారా. ఈ స్టార్ ప్లేయర్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియాను ఎన్నో ఉత్కంఠభరితమైన కీలక మ్యాచ్‌లలో విజయతీరాల వైపు నడిపించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 2025లో క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ స్టార్ ప్లేయర్ ఆగస్టు 24, 2025న అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్ట్ మ్యాచ్‌ల్లో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో సహా 7195 పరుగులు చేశాడు.

చాలా కాలంగా ఆటకు దూరంగా ఉన్న వృద్ధిమాన్ సాహా ఫిబ్రవరి 1, 2025న క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా సాహా రిటైర్మెంట్ టైంలో సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నాడు. ఈ స్టార్ ప్లేయర్ డిసెంబర్ 2021లో టీమిండియా తరఫున తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తను చివరి సారి వన్డే మ్యాచ్‌లో 2014లో మైదానంలోకి దిగాడు. అప్పటి నుంచి, సాహాకు అవకాశాలు రాలేదు. దీంతో ఈ ప్లేయర్ ఆటకు రిటైర్మెంట్ కావాలని నిర్ణయించుకున్నాడు.

‘గుడ్ బై’ చెప్పిన పియూష్ చావ్లా..
లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా కూడా జూన్ 6, 2025న క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2012లో ఆడిన చావ్లా భావోద్వేగంతో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ స్టార్ స్పిన్నర్ మూడు ఫార్మాట్లలో కలిపి 1,000 వికెట్లకు పైగా సాధించాడు. 2012లో తన చివరి మ్యాచ్‌లో చావ్లా టీమిండియా తరఫున మూడు టెస్టులు, 25 వన్డేలు, ఏడు టీ20లు ఆడాడు.

రోహిత్ శర్మ – 7 మే 2025న టెస్ట్‌ల నుంచి రిటైర్ అయ్యాడు.

విరాట్ కోహ్లీ – 2025 మే 10న టెస్ట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

చతేశ్వర్ పుజారా – ఆగస్టు 24, 2025న మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యాడు.

వృద్ధిమాన్ సాహా – ఫిబ్రవరి 1, 2025న రిటైర్మెంట్ ప్రకటించాడు.

పియూష్ చావ్లా – జూన్ 6, 2025 – మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ అయ్యాడు.

ఆర్ అశ్విన్ (ఐపీఎల్ నుంచి) – ఆగస్టు 27, 2025

అమిత్ మిశ్రా – సెప్టెంబర్ 4, 2025 – మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్

మోహిత్ శర్మ – డిసెంబర్ 3, 2025 – మూడు ఫార్మాట్లకు గుడ్‌బై ప్రకటించాడు

వరుణ్ ఆరోన్ – జనవరి 10, 2025 – క్రికెట్‌కు రిటైర్మెంట్ చెప్పాడు

రిషి ధావన్- జనవరి 5, 2025న పరిమిత ఓవర్ల భారత క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

READ ALSO: Saudi Arabia: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు పచ్చజెండా ఊపిన ముస్లిం దేశం..

Exit mobile version