టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్ మాన్ గిల్ క్రికెట్ లోనే కాదు.. సినీ ప్రపంచంలో కూడా చరిష్మాను చూపించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుత ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున గిల్ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఆదివారం లక్నో సూపర్ జెయింట్‌పై 94 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిలియనీర్ లీగ్‌లో ఉన్న హైప్ నేపథ్యంలో.. హాలీవుడ్‌తో శుబ్ మన్‌కు ఉన్న అనుబంధం గురించి ఇవాళ ( సోమవారం ) పలు వార్తలు వచ్చాయి.
Also Read : Arvind Krishna: హీరోగానే కాదు ‘గ్రే’ షేడ్స్ కూ అరవింద్ కృష్ణ సై!
హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ స్పైడర్‌మ్యాన్ ఫ్రాంచైజీకి శుబ్ మన్ గిల్ పని చేయబోతున్నాడు. స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్, స్పైడర్ మ్యాన్ సిరీస్‌లోని కొత్త యానిమేషన్ చిత్రం జూన్ 2వ తారీఖున థియేటర్లలో విడుదల కానుంది. ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాను హిందీతో పాటు కొన్ని ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మూవీ కోసం ఎదురుచూస్తూన్న ఇండియన్ ఫ్యాన్స్ కు డబుల్ డోస్ ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. అయితే, ఈ క్రమంలోనే స్పైడర్‌మ్యాన్ మూవీకి శుబ్ మాన్ గిల్ తన వాయిస్ ను ఇస్తున్నాడు. ఈ సినిమాకు హిందీ, పంజాబీ వెర్షన్‌లకు శుబ్ మాన్ గిల్ తన గాత్రం అందిస్తున్నాడు.
Also Read : Pushpa 2: ‘పుష్ప 2’ లో ఐటెంసాంగ్.. బన్నీకి టైట్ హాగ్ ఇచ్చి కన్ఫర్మ్ చేసిన హీరోయిన్ ..?
2021లో వచ్చిన.. స్పైడర్‌మ్యాన్.. నో వే హోమ్ సూపర్‌హిట్‌గా నిలిచి.. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత అభిమానులు స్పైడర్ మ్యాన్ సీక్వెల్ కోసం చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి భారత్ పాటు దేశీ స్పైడర్-మ్యాన్‌కి స్పెషల్ గా కానుంది. దేశీ స్పైడర్ మ్యాన్‌గా పవిత్ర ప్రభాకర్ బిగ్ స్క్రీన్ అరంగేట్రం చేస్తున్నాడు. ఈ పాత్రకే శుబ్ మాన్ గిల్ తన వాయిస్ ను ఇస్తున్నాడు.
Also Read : Go First Troubles: ‘ఫస్ట్’.. మా విమానాలు మాకిచ్చేయండి. ఆ తర్వాత.. మీరేమైనా చేసుకోండి
శుభ్‌మాన్ గిల్‌కు ఇప్పటికే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ యంగ్ క్రికెటర్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ వాయిస్‌తో తన అభిమానులను మరింతగా ఆకట్టుకోబోతున్నాడు. స్పైడర్ మ్యాన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన గిల్.. ఇది తనకు ఇష్టమైన సూపర్ హీరో క్యారెక్టర్ అని వెల్లడించాడు. దీంతో ఓ చిత్రానికి తన వాయిస్ ను అందించిన తొలి క్రీడాకారుడు.. అది కూడా హాలీవుడ్ ఫ్రాంచైజీలలో ఒకటి నిలిచిన సంస్థతో పని చేస్తున్నా.. తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
