Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Cinema Sequel Trend: ఇప్పటివరకు కేవలం ఓటీటీ వెబ్ సిరీస్‌లకే సీజన్ల మీద సీజన్లు రావడం చూశాం. కానీ ఇప్పుడు వెండితెరపై కూడా సరిగ్గా అదే ట్రెండ్ కొనసాగుతోందని కనిపిస్తుంది. ఒక కథ బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే చాలు.. కేవలం రెండో భాగంతో సరిపెట్టకుండా పార్ట్ 3, పార్ట్ 4 అంటూ మన స్టార్ డైరెక్టర్లు భారీ ఫ్రాంచైజీలను ప్లాన్ చేస్తున్నారు. ఒక్కసారి కథ మొదలైతే ఇక ఆపేదే లేదంటూ రాబోతున్న ఆ క్రేజీ ప్రాజెక్టులు, సీక్వెల్స్ విశేషాలు ఒకసారి చూద్దామా..
సాధారణంగా ఓటీటీ కంటెంట్‌కు మాత్రమే నిరంతరం కొత్త సీజన్లు రావడం చూస్తుంటాము. అయితే మన దర్శకులు ఇప్పుడు పూర్తి స్థాయి సినిమాలను సైతం సుదీర్ఘ ఫ్రాంచైజీలుగా మారుస్తున్నారు. ఒక కథను రెండు భాగాలకే పరిమితం చేయకుండా.. ఏకంగా మూడు, నాలుగు భాగాల వరకు బలమైన కథాంశాలను సిద్ధం చేసుకుంటున్నారు.
Also Read
- Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
- Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
- South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
తాజాగా విడుదలైన ‘జైలర్ 2’ క్లైమాక్స్‌లో విజయ్ సేతుపతి ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ సిరీస్‌లో ‘జైలర్ 3’ కూడా ఖాయమని దర్శకుడు నెల్సన్ హింట్ ఇవ్వకనే ఇచ్చారు. మరోవైపు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో నాలుగో భాగం తప్పకుండా ఉంటుందని దర్శకుడు జీతు జోసెఫ్ ఇప్పటికే స్పష్టం చేశారు. హిందీలో ఈ కథను ముగించినప్పటికీ.. మలయాళంలో మాత్రం ‘దృశ్యం 4’ రాబోతుంది.
మరోవైపు కన్నడ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించిన ‘కాంతార’ సిరీస్‌లో కూడా పార్ట్ 3 ఉంటుందని.. ప్రస్తుతం ఆ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నామని నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి స్వయంగా వెల్లడించారు. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ చిత్రాలకు సైతం పార్ట్ 3 ఉంటుందని ఆయా దర్శకులు ఎప్పుడో ప్రకటించారు. ప్రస్తుతం ఆ మేకర్స్ ఇతర భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ‘పుష్ప 3’, ‘కేజీఎఫ్ 3’ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయనే విషయంలో స్పష్టత లేనప్పటికీ, అవి కచ్చితంగా వస్తాయనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. ఇదివరకు హీరో సూర్య నటించిన యముడు సినిమా కూడా 3 పార్టీలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఒక్కసారి సక్సెస్ ఫార్ములా దొరికితే ఇక కథను ఆపకుండా ఫ్రాంచైజీలతో బాక్సాఫీస్‌ను ఏలడమే లక్ష్యంగా మన దర్శకులు ముందుకు సాగుతున్నారు.
తాజావార్తలు
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!