NTV Telugu Site icon

Nikhat Zareen: నిరాశపరిచిన నిఖత్ జరీన్.. ప్రీక్వార్టర్స్‌లో తప్పని ఓటమి

Nikhat Zareen

Nikhat Zareen

Nikhat Zareen Lost in Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణంపై గురిపెట్టిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ నిరాశపరిచింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్స్‌లో చైనా బాక్సర్‌ వు హు చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్స్‌లో నిఖత్ పతక ఆశలు ఆవిరయ్యాయి. ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్‌పై ప్రత్యర్థి చైనా బాక్సర్ వుహు తొలి రౌండ్‌లో పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది.

Read Also: Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఓటమి

మొదటి రౌండ్‌ను నిఖత్ 49-46తో చేజార్చుకుంది. రెండో రౌండ్‌ను 48-47తో ముగించింది. చివరి రౌండ్‌లో 45-50 తేడాతో ఓటమిపాలైంది. తొలి బౌట్‌లో జర్మనీ బాక్సర్‌పై గెలిచి రౌండ్‌ ఆఫ్‌ 16లో అడుగు పెట్టిన నిఖత్‌.. చైనా బాక్సర్ జోరు ముందు నిలవలేకపోయింది. ఈసారి ఒలింపిక్స్ లో బాక్సింగ్ నుంచి కచ్చితంగా ఓ మెడల్ తెస్తుందనుకున్న నిఖత్ జరీన్ కనీసం క్వార్టర్ ఫైనల్ కూడా చేరకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. 50 కేజీల విభాగంలో రౌండ్ ఆఫ్ 16లోనే నిఖత్ పోరు ముగిసింది.

Show comments