NTV Telugu Site icon

Satwiksairaj: ఏషియన్ మెడల్ ట్రయల్ మాత్రమే.. నా టార్గెట్ అదే: సాత్విక్

Satwiksairaj

Satwiksairaj

Satwiksairaj Says My Goal is to win a medal in Olympics: చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడలు 2023లో మెడల్స్ సాధించిన బాడ్మింటన్ ప్లేయర్స్‌ని కోచ్ పుల్లెల గోపీచంద్ సన్మానించారు. గచ్చిబౌలి బ్యాడ్మింటన్ అకాడమీలో సాత్విక్ సాయిరాజ్‌, హెచ్ఎస్ ప్రణయ్‌లను ఘనంగా సన్మానించారు. భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టిలు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించారు. మరోవైపు షట్లర్ ప్రణయ్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.

సన్మానం అనంతరం ఎన్టీవీతో కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ… ‘ఏషియన్ గేమ్స్ 2023లో మెడల్స్ సాధించడం చాలా హ్యాపీగా ఉంది. 41 ఏళ్ల తరువాత మెన్స్ టీమ్ మెడల్ సాధించింది. గత పదేళ్లలో దేశంలో క్రీడలకు ప్రాధాన్యత పెరిగింది. ఉమెన్స్ సింగిల్స్‌లో సింధు మరింత ముందుకు వెళ్తుంది. మోడీ గవర్నమెంట్ క్రీడలను ఎంకరేజ్ చేస్తుంది’ అని అన్నారు.

Also Read: IND vs AFG: టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్‌.. అశ్విన్ ఔట్! తుది జట్లు ఇవే

ఎన్టీవీతో హెచ్ఎస్ ప్రణయ్‌ ప్రత్యేకంగా మాట్లాడుతూ… ‘ఇది నా మొదటి ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్. మరో వారంలో మరో గేమ్ ఉంది. దాని కోసం ప్రిపేర్ అవుతున్నా. నా పేరెంట్స్, కోచ్ ఎంకరేజ్ వల్లే ఇది సాధ్యమయింది. ఓడినప్పుడు కూడా నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు. ఏషియన్ మెడల్ ట్రయల్ మాత్రమే ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడమే నా లక్ష్యం. దానికోసం ఇంకా కష్టపడుతా’ అని తెలిపాడు.