Site icon NTV Telugu

Indian Army : అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి 5,000 చెట్లను నాటిన ఇండియన్ ఆర్మీ..

Army

Army

అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి అలాగే స్థానిక పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అసోం లోని సోనిత్‌ పూర్ జిల్లాలో భారత సైన్యం లోని ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ (ETF) యూనిట్ బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దాదాపు 5 వేల చెట్లను నాటినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ అనేది టెరిటోరియల్ ఆర్మీ (TA) కింద వస్తుంది. ఇది ప్రకృతి వైపరీత్యాలు, జాతీయ అలాగే ప్రాంతీయ అత్యవసర పరిస్థితుల్లో భారత సాయుధ దళాలు, పౌర అధికారులకు క్లిష్టమైన కార్యాచరణతో పాటు రవాణా మద్దతును అందించే ఒక విశిష్ట సైనిక రిజర్వ్ ఫోర్స్.

NDA: ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతిని కలువనున్న ఎన్డీయే నేతలు..

ఈ కార్యక్రంలో భాగంగా.. ఓ ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ., అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలో 2007లో స్థాపించబడిన ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్, విపరీతమైన అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి అలాగే ప్రాంతం యొక్క పెళుసుగా ఉన్న పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఈ సంస్థ ప్రారంభం నుండి పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్రను పోషించింది. ఈటీఎఫ్ సోనిత్‌పూర్ జిల్లాలోని గమనీ, గరోబస్తీలో పర్యావరణంపై సామూహిక అవగాహన ప్రచారం, సామూహిక మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహించింది.

Heart Attack: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో యువకుడు మృతి.. నిజామాబాద్లో ఘటన

ఈ నేపథ్యంలో స్థానిక గ్రామాలు, పాఠశాలల్లో మొత్తం 5,000 నీడనిచ్చే, పండ్ల చెట్లను నాటారు. స్థానిక గ్రామస్తులు, పాఠశాల విద్యార్థుల ఎంతో ఉత్సహంగా పాల్గొని వారి తోడ్పడుతో కమ్యూనిటీల పచ్చదనాన్నిపెంచడానికి చేతులు కలిపారు.

Exit mobile version