Site icon NTV Telugu

AK-203 Rifle: భారత్‌ కా ‘షేర్’ AK-203.. నిమిషానికి 700 బుల్లెట్లు, 800 మీటర్ల రేంజ్..

Ak 203

Ak 203

భారత సాయుధ దళాలు కొత్త బ్యాచ్ AK-203 అస్సాల్ట్ రైఫిల్స్‌ను పూర్తి స్థాయిలో పొందబోతున్నాయి. ఇది కలాష్నికోవ్‌ సిరీస్‌లో అత్యాధునికమైన వెర్షన్. ఈ రైఫిల్ నిమిషంలో 700 రౌండ్ల వరకు కాల్పులు జరపగలదు. 800 మీటర్ల రేంజ్‌ను కలిగి ఉంటుంది. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో దీన్ని తయారు చేస్తున్నారు. ఇది భారత్- రష్యా మధ్య జాయింట్ వెంచర్. ‘షేర్’ పేరుతో ఏకే-203 రైఫిళ్లను తయారు చేస్తోంది.

READ MORE: S*ex Scandal: థాయ్‌లాండ్‌ని కుదిపేస్తున్న బౌద్ధ సన్యాసుల సె*క్స్ కుంభకోణం..

రూ.5,200 కోట్ల ఒప్పందం కింద ఈ కంపెనీ సాయుధ దళాలకు ఆరు లక్షలకు పైగా ‘షేర్’ రైఫిళ్లను సరఫరా చేయాల్సి ఉంది. ఒప్పందం ప్రకారం.. 2032 అక్టోబరు నాటికి 6,01,427 ఏకే 203 రైఫిళ్లను అందజేయాల్సి ఉంది. కానీ, అనుకున్న సమయానికి 22 నెలల ముందు అంటే.. డిసెంబర్ 2030 నాటికి డెలివరీలను పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు ఐఆర్‌ఆర్‌పిఎల్ చీఫ్ మేజర్ జనరల్ ఎస్‌కె శర్మ గురువారం తెలిపారు. “ఇప్పటివరకు దాదాపు 48,000 ‘షేర్’ రైఫిళ్లు పంపిణీ చేశాం. రాబోయే రెండు, మూడు వారాల్లో మరో 7,000 రైఫిళ్లు అందజేస్తాం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో 15,000 రైఫిళ్లు అందజేస్తాం..” అని ఆయన తెలిపారు.

READ MORE: Akshay Kumar : 700 మంది స్టంట్‌మెన్‌లకు అక్షయ్ కుమార్ సహాయం!

కాగా.. ఏకే 203.. ఏకే 47, ఏకే-57 నమూనాను పోలి ఉన్నా.. దానికంటే శక్తివంతమైనది.. అత్యాధునికమైనది. ఒక్కసారి ట్రిగ్గర్‌ నొక్కితే నిమిషానికి ఏడు వందల బుల్లెట్స్‌ దూసుకుపోతాయి. 800 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితత్వంతో చేధిస్తుంది. అలాగే ఇన్సాస్‌తో పోలిస్తే బరువు తక్కువ. ఇన్సాస్‌ రైఫిల్‌ మ్యాగజైన్‌ లేకుండానే నాలుగున్నర కిలోలుంటే.. ఏకే 203 మాత్రం మ్యాగజైన్‌తో కలిపి నాలుగు కిలోల బరువుంటుంది. దీంతో సైనికులకు భారంగా కాకుండా ఉంటుంది. అలాగే దీని వెనక భాగాన్ని మడిచే సౌకర్యం ఉండటంతో.. ఉపయోగించనప్పుడు పట్టుకోవడానికి, శరీరంపై ధరించడానికి సులభంగా ఉంటుంది. అంతేకాదు దీని మెకానిజం కూడా ఇన్సాస్‌తో పోలిస్తే చాలా అద్బుతమైంది. అత్యాధునికమైంది. ఇన్సాస్‌ను వినియోగించిన సైనికులు ఎక్కువగా చెప్పే కంప్లైంట్‌.. రైఫిల్‌ జామ్‌ కావడం.. ఏకే 203 వందశాతం సమర్ధవంతమైనది. ఎన్నిసార్లు వినియోగించినా.. బుల్లెట్స్‌ స్ర్టక్‌ అయ్యే సమస్యే లేదు. ఈ విషయంలో చేసిన ఎన్నో రకాల పరీక్షలను సమర్థవంతంగా దాటిందీ ఏకే 203.

Exit mobile version