Nikki Haley: 2024లో జరిగే అమెరికా అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్లు భారతీయ-అమెరికన్, అమెరికా రాజకీయవేత్త నిక్కీ హేలీ ప్రకటించారు. దీంతో, వైట్‌హౌస్‌కు పోటీగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సవాలు చేసిన మొదటి రిపబ్లికన్‌గా ఆమె అవతరించారు. నిక్కీ హేలీ ఇటీవలి సంవత్సరాలలో తమ దారిని కోల్పోయిన పార్టీని, దేశాన్ని పునరుజ్జీవింపజేయగల మార్పుదారుగా తనను తాను నిలబెట్టుకుంటున్నారు. ట్రంప్ మళ్లీ పోటీ చేస్తే తాను సవాలు చేయనని గతంలో ఆమె ప్రముఖంగా చెప్పింది. కానీ ఆమె తన వైఖరిని మార్చుకునే ముందు, అమెరికా వేరే మార్గం వైపు చూడాలని వాదించింది.
మంగళవారం నుంచే నిక్కీ హేలీ తన అభ్యర్థిత్వ ప్రచారాన్ని ప్రారంభించారు. అందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆమె అభ్యర్థిత్వం కోసం పోటీపడతారు. ప్రెసిడెంట్ బ్యాలెట్‌లోకి ప్రవేశించే ముందు, వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ప్రైమరీలో ఆమె గెలవాలి. అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024న జరగాల్సి ఉంది. 51 ఏళ్ల నిక్కీ హేలీ సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్‌గా, ఐక్యరాజ్యసమితిలో మాజీ యూఎస్ రాయబారిగా ఉన్నారు. 39 సంవత్సరాల వయస్సులో, హేలీ జనవరి 2011లో సౌత్ కరోలినామొదటి మహిళా గవర్నర్‌గా, యూఎస్‌లో అతిపిన్న వయస్సులోనే గవర్నర్ బాధ్యతలు తీసుకుని చరిత్ర సృష్టించారు.
BBC Offices: బీబీసీ కార్యాలయాల్లో రెండో రోజూ ఐటీ సర్వే.. అమెరికా ఏమందంటే?
ఆమె ప్రసంగించిన వీడియో సందేశంలో ఆమె మాట్లాడుతూ,, భారత సంతతీయుల కుమార్తెగా గర్వపడుతున్నానన్నారు. తెలుపు, నలుపు లేదని.. నీ పని.. తేడాలపై కాదు సారూప్యతలపై చూపించమని అమ్మ ఎప్పుడూ చెబుతుంటుందని ఈ సందర్భంగా నిక్కీ వ్యాఖ్యానించారు. చైనా,రష్యాలు వేధించవచ్చని అనుకుంటున్నారు. కానీ బెదిరింపులకు నేను భయపడనన్నారు. దేశ పటిష్ఠత కోసం కొత్త తరం నాయకత్వానికి ఆసన్నమైందన్నారు.
భారతీయ అమెరికన్ నిక్కీ హేలీని రాజకీయ పండితులు తొలి నుంచి తక్కువ అంచనా వేస్తూ వచ్చారు. కానీ ఆమె ప్రతిసారి తను విజయం సాధిస్తూ వారి అంచనాలను పటాపంచలు చేశారు. అజిత్ సింగ్ రణ్‌ధావా, రాజ్‌కౌర్ రణ్‌ధావా అనే సిక్కు దంపతులకు జన్మించారు నిక్కీహెలీ. తండ్రి పంజాబ్ వ్యవసాయ వర్సిటీ ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. తల్లి దిల్లీ వర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. భారత్‌లోని పంజాబ్ నుంచి కెనడాకు వలస వచ్చిన వారు.. 1960లో అమెరికాలో స్థిరపడ్డారు. క్లెమ్‌సన్ వర్సిటీ నుంచి అకౌంటింగ్ డిగ్రీ పట్టా పొందిన ఆమె.. దుస్తుల వ్యాపారం చేశారు. రాజకీయాల్లోకి రాకముందు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వుమెన్ బిజినెస్ ఓనర్స్ అధ్యక్షురాలిగా పని చేశారు.